సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 వినాలి... కనాలి...
   ******
ఇతరులతో మనం ఎలా ఉండాలో,ఉండగలగాలో తెలిసేలా చేసేవి,మన వ్యవహారాల తీరు తెన్నులు ఈ రెండింటి మీదే ఆధారపడి ఉంటాయి.
కొంతమంది మనల్ని నమ్ముకునో  ఇతరత్రా రహస్యాలు మనకు చేర వేయాలనో... ఉత్సుకత, ఆత్రుతతో  చాలా చాలా విషయాలను చెబుతూ ఉంటారు.
వాటిని మధ్యలో అడ్డుపడకుండా సావధానంగా వినాలి. అప్పుడే వాళ్ళకు మనపై నమ్మకం కుదురుతుంది.
విన్న వాటిపై వెంటనే స్పందించి ఖండించకుండా, హృదయంతో కనాలి. అంతరంగంతో అవలోకనం చేయాలి. వారి మాటల్లో నిజాలున్నాయా,ఇజాలూ, ఇగోలు ఉన్నాయా అనేది  గ్రహించగలగాలి.
అలాంటప్పుడే మనం ఎలా ఉండాలో, ఉండగలగాలో తెలుస్తుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు