వరంగల్ భద్రకాళీ ;-యం. వి. ఉమాదేవి
వరములిచ్చే తల్లీ 
వరంగల్ భద్రకాళీ 
దుష్ట సంహారిణీ 
దురిత మర్ధిని దేవీ !

జ్యేష్ఠ మాసపు పూజ 
జేజేలు జననికీ 
లక్షకుంకుమ పూజ 
లలితాంబికా గౌరీ !

కారుణ్య మూర్తికిదే 
కస్తూరి జయమాల 
వీర భయంకరికిదే 
వివిధ కదంబమాల!

రక్త బీజాక్షహరి 
రావమ్మా మముబ్రోవ 
గండ్ర గొడ్డలి బూని 
గర్జించు మహంకాళి !

సరిబుద్ధి నీయుమా 
చండికా కాపాలి 
మహిళా రక్షణ నీవే 
మాహేశ్వరీ జ్వలిత !

దుర్జనుల దునుమాడు 
త్రిభువనేశ్వరి మాత 
గండాలు దాటించు 
గాయత్రికి స్వాగతం !!

కామెంట్‌లు