పిల్లల్లారా రారండి;- త్రిపురారి పద్మ.-జనగామ.
 పల్లవి::
పిల్లల్లార రారండి
బడిలో మీరు చేరండి
చదువుల పండుగ వచ్చింది.
జ్ఞానం ఎంతో ఇస్తుంది.
          "పిల్లల్లార"
చరణం::
వసతులు ఎన్నో మీకోసం
ప్రభుత్వ బడిలో ఉన్నాయి.
ప్రతిభను పెంచే 
బోధనలు
గురువుల చెంతన ఉన్నాయి.
         "పిల్లల్లారా"
చరణం::
పోషక విలువల ఆహారం
ఎంతో రుచిగా ఉంటుంది.
ఏక రూపతా దుస్తులను
ఉచితంగా మీకిస్తుంది.
        "పిల్లల్లారా"
చరణం::
ఆంగ్ల మాధ్యమం మీకోసం
ఇపుడే బడికి వచ్చింది.
పాఠ్య పుస్తకం మీదరికే 
అక్షర  నిధిగా వస్తుంది.
      "పిల్లల్లారా"
 చరణం:
ఆటల పాటల నాటికల
వేదికలెన్నో ఉంటాయి
ఆదర్శంగా నిలిపేటి
అవకాశాలు వస్తాయి.
      "పిల్లల్లార"

కామెంట్‌లు