పట్నం పోయినఆ పిలగాడు అక్కడ ఉండాలంటే ఏదో ఒక నౌకరు సేయాలే కదా!గందుకని అరుసకు సిన్న బాపు అయిన నాతి బూమయ్య దగ్గరికి పోతేబూమయ్య తాను పని జేసే కంపిన్ల డూటి పెట్టిచ్చిండు.నెలకు మున్నూట యాబై రూపాయల జీతం.ఊరి నుండి పోయినంక రెండు దినాలకే డూటి మీద ఎక్కిండు.డూటి జేసుడు, రూమ్ ల కచ్చిఅండుకొని తినిఇగ రాసుడే రాసుడు.కొన్ని పత్రికలకు కైతలు రాసి తీసుక పోయి ఇచ్చిండు. పది,పదిహేను దినాల లోపటనే కొన్నిపత్రికలల్ల అచ్చు అయినాయి . ఇగ ఆ పోరని సంబురం అంతా ఇంతా గాదుల్లా!ఇంకా రాసుడు ఎక్కువ జేసిండు.కలం స్నేహం సేసిండు.శానా మందితో సోపతి అయింది.దినాం రికాం లేకుంట కారట్లు రాసేటోడు.ఆ పిలగానికి దినాం పది, పది హేను కారట్లు అచ్చేటివి.ఒక రోజు కంపెనీకి యాబై ఉత్తరాలు అచ్చే సరికిఆ కంపిన్ మేనేజర్ పిలిసిఆ ఉత్తరాలను తన దగ్గర పెట్టుకొని అడిగిండు"నువ్వు బయట ఏం పని జేస్తవ్?' అని. గట్ల అదిగేసరికి మనోనికి సల్ల జెముటలు పట్టినయ్.బయ పడుకుంటనే"ఏం లేదు సార్! " అని అన్నడు." ఏం చేయకుంటే నీకు ఇన్ని లెటర్స్ ఎందుకు వస్తాయి? నిజం చెప్పు.బయట నువ్వు చేసే పని ఏమిటి?" అని నిలదీసే సరికి అసలు ముచ్చట సెప్పిండు.అంతా ఇన్నంక" నువ్వు ఇక నుండి నీ రూమ్ అడ్రస్ ఇచ్చుకో.కంపెనీ అడ్రస్ ఇవ్వకు.సరేనా! " అని సెప్పి పంపిచ్చిండు.మేనేజర్ పిలిస్తే ఎందుకో అని బగ్గ భయపడ్డ మనోనికిఉత్తరాల ముచ్చట గురించి అడిగే సరికి పానం నిమ్మలం అయింది.గా ఉత్తరాలే గా పోరనిబతుకునే మార్సిందుల్లా!ఆ కతేందో ఇంకోసారి సెపుతా.అచ్చరాలు ఉత్తయే అనిగంజిల ఈగోలెతీసి పారెయ్య కుర్రి.అచ్చరాలుబతుకులను మారుత్తయ్, మనుసులను కలుపుతయ్,జతను గూడ జేత్తయ్ఔ మల్ల!
ఔ మల్ల! : బాలవర్ధిరాజు మల్లారం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి