కరెన్సీకి కాళ్లోస్తే....
ఖరీదైన ఖాళీ కోటలు దాటి
కష్టాన్ని నమ్ముకున్న
కూలి పేటల్లో పయనిస్తుంది...
చిమ్మచీకట్లు కమ్మేసిన
బ్యాంకు లాకర్ల నుంచి
వెళ్ళివస్తానంటూ
వాక్ఔట్ చేసేస్తుంది...
నోట్ల కోసం నోట
సొంగకార్చుకునే
నాటుగాళ్ళను
ఫాలోమీ అంటూ తన
వెంట కుక్కల్లా తిప్పిస్తుంది...
కూటికి లేని వాళ్ళ
కడుపులను కొట్టి కోట్లు
కూడబెట్టిన కొటిశ్వరులపై
కనికరం చూపక
కొరడా ఝళిపిస్తుంది...
బొత్తిగా మానవత్వాన్ని
మరచి మనీ మనీ
అంటూ మనీ మైండ్
సెట్‌తో బ్రతికేస్తున్న
మనీ మనుషుల
చేతులకు చిక్కకుండా
పారిపోతున్న వాళ్లను
ముప్పుతిప్పలు
పెట్టి మూడు చెరువుల
నీళ్ళు తాగిస్తుంది...
ఖరీదైన ఖాళీ కోటలు దాటి
కష్టాన్ని నమ్ముకున్న
కూలి పేటల్లో పయనిస్తుంది...
చిమ్మచీకట్లు కమ్మేసిన
బ్యాంకు లాకర్ల నుంచి
వెళ్ళివస్తానంటూ
వాక్ఔట్ చేసేస్తుంది...
నోట్ల కోసం నోట
సొంగకార్చుకునే
నాటుగాళ్ళను
ఫాలోమీ అంటూ తన
వెంట కుక్కల్లా తిప్పిస్తుంది...
కూటికి లేని వాళ్ళ
కడుపులను కొట్టి కోట్లు
కూడబెట్టిన కొటిశ్వరులపై
కనికరం చూపక
కొరడా ఝళిపిస్తుంది...
బొత్తిగా మానవత్వాన్ని
మరచి మనీ మనీ
అంటూ మనీ మైండ్
సెట్‌తో బ్రతికేస్తున్న
మనీ మనుషుల
చేతులకు చిక్కకుండా
పారిపోతున్న వాళ్లను
ముప్పుతిప్పలు
పెట్టి మూడు చెరువుల
నీళ్ళు తాగిస్తుంది...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి