పట్టుదల;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
 జగద్రక్షకుడైన  శ్రీరామచంద్రమూర్తికి  రాక్షస రాజైన రావణాసురుడు చెప్పిన  రాజనీతి నీ మనసుకు ఏది నచ్చితే  అది తక్షణం కార్యరూపం దాల్చాలి.  తరువాత చేద్దామని ప్రక్కన పెడితే ఈ జన్మలో చేయలేవు. మనసు చెడు అని దేనిని చెప్తుందో  దానిని జన్మలో చేయకు. నా చెల్లికి ఇచ్చిన మాట కోసం  ముల్లోకాలకు మాత  వేదవతి  సాధ్వి మాతల్లి  నా మాతృమూర్తి లాంటి సీతమ్మను చెర బట్టడం  నేను తెలిసి చేసిన తప్పు  అందుకే నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను. భారతదేశ స్వాతంత్ర్య సమర ఉద్యమంలో ఎదుటివారికి  రొమ్ము చూపించి పోరాడిన  టంగుటూరి ప్రకాశం పంతులు గారు, నిలిచి గెలిచిన సత్కీర్తి నెగడు గాక దవ్వుదవ్వుల  నిట్లయిన   అన్న తిక్కన వాక్యాలను జ్ఞాపకం పెట్టుకుని  రణ భూమి లో గెలిచిన  వీరుడు. వీరిద్దరి మాటల వల్ల మనకు తెలిసినది ఏమిటి  ఏదైనా మంచి కార్యం తల పెట్టినప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకొని దానిని సాధించే వరకూ పోరాడవలసినదే మధ్యలో ఆగితే  వాడంత పిరికిపంద మరొకడు లేడని అందరూ ఎగతాళి చేస్తారు ఆ స్థితికి రావద్దు. బడేగులాం ఆలీఖాన్ గారు చివరి రోజుల్లో హాస్పటల్ లో ఉన్నారు. కీర్తనలు ఆలపిస్తూ వుంటే వైద్యులు వచ్చి అలా చేయకండి అలా చేస్తే ప్రాణానికే హాని అని సలహా ఇస్తే  నేను పాడడం మరిచిపోతే  మరణించినట్లేకదా  అందుకే పాడుతున్నాను అన్నాడు.  అలా మధ్యలో మానివేస్తే నేను మరణించిన వానితో సమానం అని. వేమన మనకు సలహా ఇస్తున్నారు  ఆయన వ్రాసిన పద్యం ఏమిటంటే

"పట్టు పట్టరాదు పట్టి విడువరాదు  
పట్టెనేని బిగియ పట్టవలయు  పట్టి విడుట కన్న పడి చచ్చుటే మేలు..."

కామెంట్‌లు