కన్ను గీటిన రోజు మరి గుర్తుకొస్తుంది
నిన్ను తాకిన క్షణం హృది మత్తుకొస్తుంది
ఒకనాటి ఊసులకు ఇకగడియ పడిపోయె
నువులేని సమయమే విసుగెత్తుకొస్తుంది
ఏమిటీ బంధాలు నిర్వేద నాదాలు
వినిపించి నాగుండె బీటెత్తుకొస్తుంది
వలరాజ కినుకేల వలపులే చులకనయె
కన్నీటి సంద్రమె పోటెత్తుకొస్తుంది
విఫలమౌ కథలెన్నొ ఇతిహాస మైనాయి
విని ఉమదె నిట్టూర్పు కడకెత్తుకొస్తుంది !!
========================
బీట- పగులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి