నవమాసాలు మోసి ప్రాణం
పణంగా పెట్టి జన్మనిచ్చి....
కంటిరెప్పలా కాపాడుతూ
లాలించిన తల్లి....
కడుపునిండా తినకపోయినా
తన పిల్లలు బాగుండాలని
పైసా పైసా కూడ బెట్టి...
బిడ్డల భవితకు....
బాటలు వేసిన తండ్రి.....
నిస్వార్థమైన ప్రేమతో
పెంచి పెద్ద చేసినా
వారికీ నేడు....
వృద్దాశ్రమాలు దిక్కు
అయినాయి......
కొందరు తమ
సుఖ,సంతోషాల కోసం....
కన్నవారిని కనికరం లేకుండా
వృద్దాశ్రమాలలో వదిలేసి
తమ బాధ్యతను
మరిచిపోతున్నారు......
కట్టుకున్న ఇల్లు.....
కన్నబిడ్డలను.......
వారికి పుట్టిన పిల్లలను
వదిలి ఆశ్రమం లో
ఆనాధలైన వారి
మది వేదన....
వినేదేవరు కనేదేవరు?
కన్నబిడ్డలే కాదంటే వారి
కడుపుకోత తీర్చేదేవరు.....
తల్లితండ్రులు దైవ స్వరూపులు
వారికి ఎంత చేసిన ఏం చేసినా....
తీర్చుకోలేని రుణం మనది...
కనిపించని ఆ దేవుడి కోసం
గుళ్ళు గోపురాలు తిరిగి
వందలు, వేలు ఖర్చుపెట్టిన
ఏం వస్తుంది.....
కని,పెంచివారిని
చూసుకుంటే అందరికి
ఆనందమే కదా!
మానవ సేవే మాధవ సేవ..!!
..............
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి