నీకోసం ఏడ్చేవాడు
నీ కోసం పని చేసేవాడు
నీకోసం చనిపోయే వాడు
నీ కోసం నిలబడే వాడు ఉన్నాడు
ఈ లోకంలో
కానీ
నీ కోసం ఆకలి కొనేవాడు ఎవడు
ఒక్క అమ్మ తప్ప
ఎవరున్నారు ఈ లోకంలో
ప్రపంచ ఆకలి తీర్చే రైతు
అమ్మ చేతుల్లో
బువ్వ ముద్దా అయితే బాగుండు
రెక్కలు లేని మొక్కలు
ఆకాశంలో మెరిసే చుక్కలు
ఎండిన డొక్కలో
అన్నం మెతుకులు అయితే బాగుండు!!
ఆకలి లేని వాళ్ళు లేరు
అవకాశం లేని
లేనివాళ్లు ఆకలి గొన్నోళ్ళు
ఉదయం బ్రతకాలంటే
రాత్రికి తినాలి
రేపటికి ఉండాలంటే
ఇవ్వాలా అన్నం ఉండాలి
ఆకలి లేని వాడు లేడు
అమ్మ లేని వాడు
అన్నం లేని వాడు ఒకటే!!?
ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని
Sunitha pratap teacher

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి