నేను విశాఖ పట్నం వచ్చేసినాక ;- కోరాడ నరసింహా రావు...

  ఇక్కడ... Svln. ప్రసాద్ గారని 
మంచి నటులు, దర్శకులు...
ఎన్నో ప్రదర్శనలకు ఎన్నెన్నో బహుమతులు గెలుచుకున్న వారు, వారి పరిచయ భాగ్యం కలిగింది !"వర్తమానవచిత్రం" అని ఒక నాటకం ఉంది, దాన్ని మేము చాలామార్లు ప్రదర్శించి మంచి బహుమతులుకూడా  గెలుచుకున్నాము ఆనాటకం వేద్దామనుకుంటున్నాము అందులో మైన్ రోల్ పెద్దాయన పాత్ర, అతని స్నేహితుని పాత్ర కొంచెం కామెడీతో ఉంటుంది, మీరు వేస్తారా, అని తను అడగటం, నేను ఆపాత్రను ప్రాక్టీస్ చెయ్యటం... జరిగింది !
  మంచికథ... పిల్లల్ని ఎంతో ప్రేమతో పెంచి, ప్రయోజకుల్ని చేస్తే... వాళ్ళ సుఖము - ఆనందమె వాళ్ళు చూసుకుని 
తల్లి సంవత్సరీకం చెయ్యటానికి కూడా తీరికలేని బ్రతుకు బ్రతుకుతూ... వారి అమెరికా జీవితానికి తండ్రి అడ్డని తలచి ఓల్డేజ్ హోమ్ (అనాధాశ్రమం )లో చేర్చే ప్రయత్నం చేస్తాడు ! అంతవరకూ కథ ఎన్నోమార్లు విన్నదే, ఐతే... ట్విస్ట్ ఏమిటంటే... యే అనాథాశ్రమంలో తండ్రిని చేర్పించాలనుకుంటాడో.. అదే అనాధాశ్రమనుండి ఈ కొడుకును ఆతండ్రి తెచ్చుకుని పెంచుకుంటాడు ! చివరికి తండ్రి ఆ దుస్థితిని తట్టుకోలేక రేపుఅనాథాశ్రమంలోచేరుస్తారనగా ఆ రాత్రి...  ఆత్మహత్య చేసుకుంటాడు !
మంచి కథ.. నటులుకూడా చాలాబాగానటించారు !
   ఐతే... మారుతున్న కాలంతో పాటే మనమూ మారాలని... అలా ఆత్మ హత్య చేసుకునే ముగింపు నాకు నచ్చక... ఆ తరువాత నేను పితృదేవోభవ అనే నాటకాన్ని రాస్తూ... తండ్రి చివరిలో... కొడుకును, కోడలిని 
మనవడిని సంతోషంగా అమెరి కా  పంపుతూ...తాను ఆశ్రమం లో కూడా చేరకుండా... తనకొడుకును పెంచుకున్నట్టే 
చేరదీసి..తననే అంటిపెట్టుకుని
సేవలుజేస్తున్న పనివానికి తన తదనంతరం మిగిలిన రెండెకరాల పొలాన్నీ రాసేసి ఆ మామిడి తోటలో శేషజీవితాన్ని 
ఆ పనివానితోనే గడపాలని నిర్ణయించుకోవటం !
   నాటకమైతే చాలాబాగా వచ్చింది కానీ ఎక్కడా ప్రదర్శించ  లేకపోయాం !కెమెరాలో షూట్  చేసి నా దానికి తుదిమెరుగులు దిద్ది కనీసం యూట్యూబ్ లోనైనా పెట్టలేక పోయాం !
    ఆ తరువాత ప్రసాదుగారే వాళ్ళ పాత టీమ్ తో  లగాబుస్  లచ్చన్న అనే నాటకాన్ని... (మంచి కామెడీ )
ప్రదర్శించటం కోసం వాళ్ళు రిహార్సల్స్ వెయ్యగా చూసాను 
అదికూడా చాలా బాగుంది !
మనం చూడలేకపోతున్నాం గానీ... ఈ రోజుల్లోకూడా... 
మంచి -  మంచి సాంఘిక నాటకాలు, నాటికలు వస్తున్నాయి !.... 
  
       ******
కామెంట్‌లు