అవంతి రాజ్యాన్ని పాలించే వీరసేనుడు సభతీరిఉండగా సభలో ప్రవేసించినవ్యక్తి' ప్రభువులకు జయమగుగాక నాపేరు రమణయ్య. నేను మాపొరుగు నివాసి అయిన శివన్న ఇల్లు అతను చెప్పినవెలకు ఇష్టపడి కొనుగోలు చేసి న్యాయాధికారి సమక్షంలో చట్టప్రకారం పత్రాలు రాసుకున్నాము.కాని శివన్నకుమారుడు రామయ్య ఆఇంటిని నాకు స్వాధీనపరచడానికి అంగీకరించడంలేదు.కనుక ప్రభువులె నాకు న్యాయంచేయాలి 'అన్నాడు.
వెంటనే శివన్నను అతని కుమారుడు రామయ్యను సభకు పిలిపించారు.
' శివన్నా నీఇల్లు ఇష్టపూర్వకంగా రమణయ్యకు అమ్మినమాట యదార్ధమా ?'అన్నాడు వీరసేన మహరాజు. ' చిత్తం ప్రభు పూర్తి సమ్మతంతోనే అమ్మాను 'అన్నాడు శివన్న. 'మహారాజా నాతండ్రి నన్ను సంప్రదించకుండా మాఇల్లు రమణయ్యగారికి అమ్మాడు నాసమ్మతం లేకుంటే అది ఎలా చెల్లుబాటు అవుతుంది 'అన్నాడు రామయ్య.
'ప్రభూ అదినేను కష్టపడి సంపాదించిన ధనంతో కట్టిన ఇల్లు,అదినాకు నాపూర్వీకులద్వారా సంక్రమించినదికాదు. పైగా కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్ననన్ను ఇంటికి దూరంగా ఉన్న వేపచెట్టుకింద మంచవేసి ఉంచాడు నాకుమారుడు,ఆహారంకూడా పెట్టకుండా ఇబ్బందిపెట్టాడు. నాబాధలు గమనించిన పరంధామయ్య అనే నామిత్రుడు తను నిర్వహిస్తున్న వృధ్ధుల ఆశ్రమంలో నాకు స్ధానం కలిగించాడు. పరంధామయ్యకూడా ధనవంతుడుకాదు కాని సమాజసేవకుడిగా తనవంతుగా వృధ్ధుల ఆశ్రమం నడుపుతున్నాడు. నాలాంటి పదుగురుకి సహయంచేస్తున్న పరంధామయ్యకు నావంతు సహయంగి నాఇల్లు అమ్మిన ధనం ఇచ్చాను. నాకుమారుడు నన్నుబాగాచూసుకుని ఉంటే ఇల్లు అమ్మవలసిన అవసరం వచ్చేదేకాదు. ఈసమస్య నాకుమారుడి వలన ఏర్పడింది 'అన్నాడు శివన్న.
' రామయ్య నీకు వారం రోజులు సమయం ఇస్తున్నాను నువ్వు ఉండేఇల్లు రమణయ్యగారికి స్వాధీనపరచాలి. నీకు జన్ననిచ్చి ఎంతో ప్రేమతోపెంచి, చదివించి,వివాహంచేసిన నీతండ్రి వృధ్ధుడు,అనారోగ్యంఉన్నప్పుడు భారమయ్యాడా? నీతండ్రి సంపాదనలో భాగంకావాలి అని కోరుకున్నప్పుడు అతని పట్ల నీబాధ్యత విస్మరిస్తేఎలా? పాతిక ఏళ్ళు నిన్ను పోషించిన నీతండ్రిని నువ్వు మరో పాతికఏళ్ళు పోషించడం న్యాయమేకదా ! నిన్నునువ్వు పోషించుకోలేక నిన్నటివరకు నువ్వు నీతండ్రిపై ఆధారపడి జీవించడం హేయమైనచర్య. నీలాంటి సోమరులు సమాజానికి ఏంవినియోగపడతారు?మన రాజ్యంలో నేటినుండి తమ కుటుంబ సభ్యులను ఆదరణగాచూడకున్నా,వారినుండి మాకు ఎటువంటి ఫిర్యాదులువచ్చినా,వారిని ఇంటినుండి గెంటేవారి ఆస్తులు అంటే ఇల్లు,పొలం,ధనం,బంగారం వంటి విలువైన వస్తువులన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అన్నివృధ్ధుల,నిరాదరుల ఆశ్రమ నిర్వాహణ భారం ప్రభుత్వమే స్వీకరిస్తుంది,దీనికోసం వృధ్ధులసమస్యలు పరిష్కరించడానికి తక్షణం ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రతినగరంలో రక్షకభటుల నిలయంలో ఏర్పాటు చేస్తున్నాం 'అన్నడు వీరసేన మహరాజు.
రాజుగారి తీర్పువిన్న సభలోని వారంతా జయధ్వానాలుచేసారు.
కొత్త తీర్పు.; డా.బెల్లంకొండ నాగేశ్వరరావు., చెన్నై
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి