ఏది కవిత్వం కాదు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు
 ఏది కవిత్వం???
అని అలా అంటే ఎలా???
ఏది కాదు కవిత్వం??? 
అంటూ బదులివ్వనా 
నేనిలా....
కాటుక కనులు విడిచిన
కన్నీరు కాదా కవిత్వం
వర్షించగా మేఘం,
పుడమి చేరిన పన్నీరు
కాదా కవిత్వం...
మనసుకు నచ్చిన 
రూపం కాదా కవిత్వం
నెచ్చెలి ముక్కు 
పైన కోపం కాదా కవిత్వం...
నిదుర మరచిన 
కల కాదా కవిత్వం
సంద్రాన్ని వీడని 
అల కాదా కవిత్వం....
హృదిని తాకిన 
హాయి కాదా కవిత్వం
మిన్ను చేరిన
మిణుగురుల 
రేయి కాదా కవిత్వం...
నీలాకాశంలో
నిండు జాబిలి కాదా 
కవిత్వం 
ముద్దులొలికే
ముగ్గుల లోగిలి కాదా కవిత్వం...
విచ్చిన పువ్వు కాదా కవిత్వం...
విరిసిన నవ్వు కాదా కవిత్వం....
అంతమెరుగని కాగితాల పంతం 
కాదా కవిత్వం....
అనంతమైన సులక్షణ 
అక్షరం కాదా కవిత్వం....
ఏది కాదు కవిత్వం???
అంతా కవితమయమే కదా...
.

కామెంట్‌లు