తీపి పులుపు నల్లద్రాక్ష
గుండెకిచ్చు ఎంతోరక్ష
గుత్తులుగాను అద్భుతము
ద్రాక్ష పందిరి సుందరము !!
పచ్ఛాపచ్చని ఆకులు
వెచ్చగ పెరిగే తీగలు
వాకిలి కెంతో అందము
వచ్చి చూసేరు జనము !!
చాకోలెట్ కంటే మధురము
ద్రాక్షలతో ఆరోగ్యమూ
పచ్చద్రాక్షకో సవాలూ
నల్లని ద్రాక్ష వనాలూ !!
ఒక్క గుత్తిలో ద్రాక్షలోయ్
కిక్కిరిసి ఉండు వింతలోయ్
తొక్కకి పండుకు మధ్యలో
తీయని రసమే ఉండునోయ్ !
గుప్పెడు ద్రాక్షలు జేబులో
బాల్యం నిలిచె కళ్ళలో
ద్రాక్షలు అమ్మే అబ్బాయీ
ధన్యవాదములు నీకోయీ !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి