డా.. కందేపి రాణీప్రసాద్ రచించిన క్వారంటైన్ పుస్తక ఆవిష్కరణ


 డా.. కందేపి రాణీప్రసాద్ రచించిన క్వారంటైన్ పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ,  ఛీఫ్ విప్ అశోక్ పట్టాన్,బీజాపూర్ MLC ప్రకాష్ రాథోడ్ గార్లు బెంగుళూరు లోని విధాన సౌధ లో నేడు ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి గురించి లాక్ డౌన్ లో ఈ పుస్తకం రచించడం ఉపయోగకరమన్నారు. ఛీఫ్ విప్ అశోక్ పట్టాన్ మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు చేసిన సేవలను కొనియాడారు. బీజాపూర్ MLC ప్రకాష్ రాథోడ్ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పే విధంగా కథలు, కవితలు రచించినందుకు రచయిత్రిని ప్రశంసించారు. తెలుగులోనే కాకుండా కన్నడంలోకి అనువాదం జరగాలని కోరారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో డా. కందేపి రాణీప్రసాద్, డా. స్వాప్నిక్ సింధూర్ లు పాల్గొన్నారు. ఇందులో పలు చిత్రాలు ఆకర్షణియంగా ఉన్నాయన్నారు. 


కామెంట్‌లు