"బ్బ" ఒత్తు పదాలతో.. అబ్బురం (బాల గేయం)-గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం. ఏ (సంస్కృతం).,బి.ఇడి.,
 సుబ్బారెడ్డి పాళెమే వెళదాము
 జబ్బున పడ్డ  సుబ్బయ్యనే చూద్దాము
 డబ్బులు కాస్తా సర్దుబాటు చేద్దాము
  సుబ్బరాజు ఇంటికే వెళదాము
  నిబ్బరంగా కాసేపు ఉందాము

  సుబ్బన్నతో ఆటలాడుదాము
 సబ్బుతో స్నానమే చేద్దాము
పప్పునే మెత్తగా రుబ్బుదాము
దెబ్బతిన్న పక్షినే లేపుదాము
 అబ్బురపడే పనులనే చేద్దాము

=====================
గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం. ఏ (సంస్కృతం).,బి.ఇడి.,
తెలుగు పరిశోధకులు  
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,  తిరుపతి.
సెల్: 9493235992.


కామెంట్‌లు