సమయస్ఫూర్తి!(బోడో కథ ఆధారంగా ) అచ్యుతుని రాజ్యశ్రీ

 పేరయ్య అతని కొడుకు వీరయ్య  యాత్ర కి బైలుదేరారు. దారితప్పి ఓపెద్ద అడవిలోకి ప్రవేశించారు. అక్కడ ఓరాక్షసి ఉంది. దాని ఇంట్లో కి వెళ్ళారు.అది కన్పడగానే భయంతో అక్కడే ఉన్న డ్రమ్ములో దూరి పైన మూత పెట్టుకున్నారు. పక్కన చిల్లులు ఉండటంతో  గాలి ఆడుతోంది. బైట నించి వచ్చిన రాక్షసి పాలతో చక్కెర కలిపి దుంపపిండి వేసి బాగా కాచింది.ఆఘుమఘుమలకి తండ్రీ కొడుకుల ఆకలి ఎక్కువ ఐంది. "నాన్నా!ఆకలి దంచేస్తోంది. ఆపాయసం తింటా!లేక పోతే శోషవచ్చేలా ఉంది "అన్నాడు. కాస్త దూరంలో వాకిట కూచుంది అది!"జాగ్రత్త బాబూ! ఆరాక్షసికి ఎడంకన్ను లేదు. అక్కడ లొట్ట గుంటగా ఉంది. దానికి  ఎడంవైపు కూచుని పాయసం తిను" అన్నాడు పేరయ్య.వీరయ్య  గంటెతో పాయసం తీసి ఆకలితో  నోట్లో వేసుకోగానే నాలుక చుర్రుమని కాలింది."ఫూ. ఫూ..ష్..ష్..అని మూలుగుతూ శబ్దం చేస్తూ డ్రమ్ములో దూరాడు.అలాంటి శబ్దాలు ఎన్నడూ వినని రాక్షసి భయంతో వణికింది. "నాకన్నా  బలవంతుడు నా ఇంట్లో దూరాడు "అని బైట కి పరుగెత్తింది.దారిలో నక్క కన్పడి "ఏంటీ  రాక్షసి అత్తా!ఏమైంది?"అని ప్రశ్నించింది. "అయ్యో !నాకొంపలో బలవంతుడెవరో దూరి  ఫూ..ఫూ..ష్. ష్..అని అరుస్తున్నాడు. భయంతో బైట కి వచ్చా"అంది."పైగా కమ్మని పాయసం వండుకున్నా.తినే ప్రాప్తం లేదు "అంది."అలాగా! నేను వస్తాపద!"అని నక్క  రాక్షసి తో కలిసి  ఇంట్లో కి వచ్చింది. వీరయ్య నాలుక బాగా కాలటంతో ఇంకా పెద్ద పెద్ద గా అరవసాగాడు.నక్క ఆశబ్దం ఎక్కడ నించి వస్తోంది గ్రహించి  డ్రమ్ములో కి దిగే ప్రయత్నంలో ఉంది. పేరయ్య  దాని వేలాడే తోకను బాగా మెలిపెట్టి తిప్పుతూ ఉంటే వీరయ్య శోకాలు కేకలతో నక్క హడిలి పోయింది. అది ఊళలు వేస్తూ"రాక్షసి అత్తా! పారిపో! బలంగా ఉన్న శత్రువు నాతోక ను తెగేలా గుంజుతున్నాడు."అని ఏడుస్తూ ఉంటే రాక్షసి పారిపోయింది.తోకను పేరయ్య 
నోటి తో కొరకసాగాడు.వీరయ్య కేకలతో నక్క ఎలాగోలా చావుతప్పి కన్నులొట్టబోయినట్లు తప్పించుకుంది.తండ్రీ కొడుకులు ఇద్దరు పాయసం ఖాళీ చేసి పూర్తి గా తెల్లారకుండానే అడవినించి బైట పడ్డారు. 🌹
కామెంట్‌లు