అవ్వ-దివ్వె! అచ్యుతుని రాజ్యశ్రీ

 శ్రావస్థి లో క్షామం వచ్చింది. అంతటా హాహాకారాలు! ప్రకృతి ప్రకోపిస్తేఎవరూ ఏంచేయలేరు.కానీ అంతా ధనవంతులు కావటంతో పెద్దగా బాధ పడటంలేదు.తాము తిని రెండు తరాలకు దాచిన వారే ఎక్కువ. కానీ బీదాబిక్కీ కూడా ఉన్నారు. రాజు నగరమంతా చాటింపు వేయించాడు."ఎవరు ఆకలితో మలమలమాడుతూ ఉన్నారో అలాంటివారికి సాయం అందించాలి. ఇది మానవులుగా మనధర్మం! రాజు గా నేను నాకర్తవ్యం నిర్వహిస్తున్నాను.రాజరికం శాశ్వతం కాదు. బలవంతుడు  రాజు ని గద్దె దింపగలడు ఎక్కించగలడు.కాబట్టి సంపన్నులు ముందుకివచ్చి ఆదుకోండి.రాజు ఖజానా కి  ధాన్యాగారంకి మీవంతుసాయం చేయండి. " ఆప్రజల ప్రతిస్పందన చూడండి ఎలాఉందో?రత్నాకరుడనే వ్యాపారి ఇలా అన్నాడు "నాపేరు రత్నాకరుడే కానీ నాకున్న దంతా ఇచ్చేస్తే పంచితే రేపు నేను కూడా వారితో వీధిలో నిలబడి బిచ్చం అడుక్కునే పరిస్థితి రావచ్చు. "
ఇక సేనాపతి ఏమన్నాడంటే "ప్రజలకోసం నాప్రాణాలు అర్పించగలను కానీ నాదగ్గర అంత సంపద లేదు. నేను రాజోద్యోగిని.ఆయన దయాధర్మంపై ఆధార పడి బతికే వాడిని. " ఇక వందలాది ఎకరాల పచ్చని పైరుపొలాలున్న ధర్మపాలుడనే మోతుబరి"హు!ఎప్పుడు ప్రకృతి విరుచుకు పడుతుందో తెలీదు. బొటాబొటీగా పంటచేతికి అందింది నాకు!"అని పెదవి విరిచాడు.కానీ ఆలయంలో  ఊడుస్తూ సర్వకాల సర్వావస్థలో దైవస్మరణ తో  గడిపే ఓ అరవైఏళ్ల అవ్వ  అంది"నేను ఆకలితో ఉన్న వారి పొట్ట నింపగలను.భక్తులు ఇచ్చే తృణమో పణముతో గంజికాచి పోస్తాను.ఆలయప్రసాదం వారికే పంచుతాను.నాలాగా కొందరు ముందుకి వస్తే చాలు! అలా ప్రతివారూ తలా ఓచెయ్యి వేయండి.ఇంటింటి కొక పూవు ఈశ్వరునికి ఒకమాల!" ఆమె మాటలతో అందరికీ కనువిప్పు కలిగింది. ఆమె స్ఫూర్తితో నగరం లోని  ధనికులంతా పుట్టలోంచి చీమలు బైట పడినట్లుగా తలా ఇంత సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అందుకే  ఆఅవ్వను అంతా మనదివ్వె అని  ఆప్యాయంగా పిలవసాగారు🌹
కామెంట్‌లు