నిరీక్షణ ; - దేవిసుకన్య
నిశికి నేస్తాన్నే...
శశివై నువ్వు వచ్చేంతవరకు...

అందుకోవాలని ఆశగా ఉన్న
అడుగు కదపలేక పోతున్న
కనిపిస్తావనే ఆశతో
నిలువలేకపోతున్న...

వరమై నువ్వు వస్తున్నా..
వ్యధని దాటలేకున్న...
ఒడిలో ఒదగాలనే
తపన నాపలేకున్న...

కలలు అన్ని కమ్మని తోరణాలై
పిలిచినా...
కన్నీటి తీరాలే దాటలేకపోతున్న...

గాయమైన గతాన్ని
మరువలేకపోతున్న..
అందమైన నేటిని
అందుకోలేకపోతున్న...

నీకై ముడిచిన మల్లెలు
వడలి రాలి పోతున్నా..
ఒక్క అడుగు నీకోసం
వేయలేకపోతున్న....

మనసైన జ్ఞాపకాలు
మసకబారి పోతున్నా..
మనసులోనే నీకోసం
మూగనై పోతున్నా..
      


కామెంట్‌లు