ఆకాశ చిత్రాలు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఆకాశదేశాన
విహరిస్తా
అంతరంగాన్ని
పులకిస్తా

ఆకాశహర్మ్యాన్ని
నిర్మిస్తా
అందులో అందరికి
ఆతిధ్యమిస్తా

అకాశాన్ని 
క్రిందకుదించుతా
అవనిని
నీలంగామారుస్తా

ఆకాశపందిరిని
వేస్తా
అవనియంత ఇల్లును
కట్టేస్తా

ఆకాశదృశ్యాలను
చూపిస్తా
ఆకాశవాణిని 
వినిపిస్తా

ఆకాశదీపాలను
వెలిగిస్తా
అంధకారాన్ని
తరిమేస్తా

ఆకాశగొడుగును
ఎత్తుతా
ఆకాశగంగనునేలకు
తీసుకొస్తా

ఆకాశరంగును
అద్దుకుంటా
అందమైన బాలకృష్ణునిగా
అలంకరించుకుంటా

ఆకాశవస్త్రాన్ని
తొడుగుకుంటా
ఆకాశతీరాలను
తాకివస్తా

ఆకాశమేఘాలను
అందుకుంటా
అందమైనబొమ్మలుగా
రూపుదిద్దుతా

ఆకాశ తారకలను
పట్టకొస్తా
అందాలమాలగా గుచ్చి
మెడలో అలంకరించుకుంటా

ఆకాశానికి నిచ్చెనను
వేచి ఎక్కుతా
అందాల చందమామతో
ఆడుకొని వస్తా

ఆకాశహరివిల్లును
సారిస్తా
అందరినీ
ఆనందపరుస్తా

ఆకాశం
కాదుశూన్యము
అది అనంతము
మరి శాశ్వతము

ఆకాశాన్ని
చూడు
ఆనందాన్ని
పొందు


కామెంట్‌లు
Shyamkumar chagal చెప్పారు…
కొత్త పలుకు. చాలా బావుంది