జున్ 5, ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలతో=====================================1.పర్యావరణ పరిరక్షణం!అత్యంత అవసరం తక్షణం!సుశిక్షణం జాతికి లక్షణం!దేశదేహం పర్యావరణం! రక్షణే మానవమహోద్యమం!2.పర్యావరణం భూదేవి,వడ్డాణం!మిలమిల మెరుపు,తళతళలాడే జీవనం!ప్రకృతి ఆకృతి,కమనీయ కృతి!మధుర సంగీత,రసమయ శ్రుతి!3.పర్యావరణ పరిరక్షణ,కర్తవ్యం!అదే ఇస్తుంది,బతికే ధైర్యం!పంచభూతాల స్వచ్ఛత,తరగని సంపద!వాటి కాలుష్యం మనం,ఎదిరించలేని ఆపద!4.వాడకంలో ప్లాస్టిక్స్జీవితంలో పోలిట్రిక్స్!నశించిన ఉదయం,జాతికి శుభోదయం!చెట్లను నరకడం,రాక్షసత్వం!వానిని నిలవనీయడం,మానవత్వం!ప్రకృతితో మమేకం,జీవనసత్యం!5. మనిషి అస్తిత్వానికి గుర్తు!అతడు నాటే సరి విత్తు!మొక్కలు -పిల్లలు,చెట్లు- వారసులు!పర్యావరణ పరిరక్షణలోసుశిక్షితులైన సైనికులు!విశ్వశాంతి పోషణకు,కారకులు!_________
మా"నవ" మహోద్యమం!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి