జీవితం ------సుమ.

 జీవితం అద్భుతం అనుకుంటే 
జీవన విధానం ఇంకా అద్భుతం !
అందుకే ఎప్పుడూ విరక్తి రానీయొద్దు ... 
మధ్యలో అంతమొందించే
హక్కు మనకు లేదు !
ప్రయత్నంలో అపజయం 
ఎదురైనా ముందుకు సాగాలి !
ముళ్ల మధ్య ఉన్న పుష్పాలు 
వికసిస్తూ పరిమళాన్ని పరివ్యాప్తిస్తాయి !
అలాగే ఎన్ని కష్టాలు ఉన్నా 
ప్రసన్న చిత్తంతో ఆనందాన్ని పంచిపెట్టాలి !

కామెంట్‌లు