జయములీయవే
జగమేలు గాయత్రి
నింబ మాలా ధరీ
నీరజా దళ నేత్రీ !
శివుని పట్టపురాణి
సింహవాహిని దేవి
శాకంబరీ మాత
శక్తి శూలా ధరీ !
కాల సర్ప భూషణీ
కరవాల హస్తినీ
అంబికా అక్షయా
అభయమ్ము నీయుమా !
ఢమరుకా ధారిణీ
దాక్షాయణీదేవి
తాటంక త్రిభువనీ
దివ్య పరమేశ్వరీ !
సమృద్ధి కారిణీ
సాంబ శివ ప్రియగౌరి
శాకినీ డాకినీ
దుష్ట సంహారణీ !
దుర్భుద్ధి నాశనీ
దురిత ఖండితదేవి
కాముకా నాశనీ
కాత్యాయనీ చండీ !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి