“కుటుంబం కోసం నిరంతరం పాటుపడుతున్న శ్రమజీవి నాన్న...!”
“కనిపించని నీ శ్రమలో.... వృధా పోదు ఆ శ్రమ నా జన్మలో...!
ఓ నాన్న....ఈ నాన్నల రోజు నీకు పాదాభివందనంతో
ఈ నా చిన్న కవిత నీరాజనం...
నాన్నంటే అంతులేని అనురాగం...!
నాన్నంటే కనిపించని ప్రేమ...!
నాన్నంటే నాకు ఒక ఆప్యాయత...!
నాన్నంటే కనిపించని కష్టం...!
నాన్నంటే ఒక గొప్ప క్రమశిక్షణ...!
నాన్నంటే అగుపించని బాధ్యత...!
నాన్నంటే నా జీవితానికి మార్గదర్శి...!
నాన్నంటే నిరంతరం చదువుకునే గ్రంథాలయం...!
ఓ నాన్న నీవే నాకు నా జీవితానికి ఒక గొప్ప గురువు...!
ఓ నాన్న నీవే నాకు నా జీవితానికి గొప్ప పాఠశాల...!
నాన్నంటే ఒక విశ్వాసం ...!
నాన్నంటే ఒక నమ్మకం ...!
నాన్నంటే ఒక ధైర్యం ...!
నాన్నంటే ఒక శౌర్యం...!
నాన్న అంటే నాకు ఒక విశ్వం ...!
నాన్నంటే నమ్మకమైన ఓదార్పు...!
నాన్నంటే నాకు ఒక ఆధ్యాత్మికం ...!
నాన్నంటే నాకు ఒక పురాణం...!
నాన్నంటే నాకు ఒక సహృదయం...!
నాన్నంటే నాకు ఒక అంతులేని సంతోషం...!
నాన్న అంటే నాకు కనిపించని ప్రేమ...!
నాన్న అంటే నాకు కన్ను కాపాడే కను రెప్ప...!
నాన్నంటే తన జీవితాన్ని కొవ్వొత్తిలా మార్చుకుని
వెలుగు నిచ్చిన వెన్నెల...!
నాన్న అంటే నన్ను అద్భుతంగా మలచిన శిల్పి...!
ఓ నాన్న నీవు నింపిన ఉత్సాహం ధైర్యం, క్రమశిక్షణ, నీ జ్ఞాపకాలు నన్నెప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటుంది...!
ఓ నాన్న నీవు అందుకే నీవు నాకు ఒక తీయని జ్ఞాపకం...!
ఇంత చేసిన నీకు నేను ఏమి ఇవ్వగలను కన్నీటి భాష్పాలులతో నీ పాదాలను కలగడం తప్ప...!
“హ్యాపీ ఫాదర్స్ డే నాన్న...!”
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి