బాల్యం నుండే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ఎంత మంచిదైనా..బడిముఖం చూడ నీక బాల్యాన్ని కూలి పనులకు
బలిపెట్టటం....డబ్బులకోసం వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చెయ్యటం.,తల్లిదండ్రు లు చేసే క్షమించరాని నేరమే గాక, ఘోరమైన మహా పాపం కూడా... !
కన్నందుకు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతక గలిగే వరకూ...
బాధ్యతాయుతంగా పెంచి,పెద్ద
చెయ్యాల్సిందే... !!
కన్నబిడ్డలంటే....సంపాదనకు
సహకరించే వనరులు కాదుగా!
జీవితంలో బాల్యావస్థ, ఆట - పాటలు, చదువు - సంధ్యలతో సాగటానికే.... !
పెద్దల స్వార్ధానికి బాల్యం
సమిదై పోకూడదు... !
అవకాశాలున్న ఈ రోజుల్లో నూ... ఉదాసీనంతో బాల్యాన్ని బండలపాలు చెయ్యటం ఎంత
దురదృష్టకరం !!
బాల్యాన్ని ఎంత బాధ్యత తో, ప్రేమగా సాకితే.... అంత మంచి గొప్పసమాజ నిర్మాణం!
నిర్లక్ష్యం చెయ్యబడ్డ బాల్యం యొక్క ప్రభావమేనేటిఅసాంఘి క,అస్తవ్యస్తఅరాచకపరిస్థితులు
బాల్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఏఒక్కరిదో అనుకుని చేతులు దులిపేసుకోటం కాదు,
ఆ బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉంది !
బాధ్యతలనువిస్మరించి,సమాజంలో శాంతి సౌఖ్యాలను కోరు కుంటే...అది అత్యాశే కదూ... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి