హయ్ చిన్నారి నేస్తాలు! జూన్ 5 వ తేదిని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం కదా! ఎందుకు జరుపుకుంటున్నాం,ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం వంటి విషయాలను ఈరోజు తెలుసుకుందాం.ఐక్య రాజ్యసమితి మొదటగా 1974 సంవత్సరం నుంచి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. 1972 లో మొదటిసారిగా యుఎన్ జనరల్ అసెంబ్లీ స్టాక్ హోములో జరిగిన సమావేశంలో ఇలా పర్యావరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది.దీనిని Eco day అని Environment day అని కూడా పిలుస్తారు. World Environment day ను సంక్లిప్తంగా WED అని అంటారు.రెండు సంవత్సరాల అనంతరం 1974 లో మొదటిసారిగా అమెరికాలోని స్పోకెన్ లో WED దినోత్సవ వేడుకలు జరిగాయి.ఆనాటి సమావేశం “Only One Earth “ అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చింది.ఇందులో 143 దేశాలు పాల్గొంటున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా కలిషితమై పోతున్న పర్యావరణాన్ని,దానివలన జరిగే నష్టాన్ని ప్రజలకు అవగాహన కల్గించటమే ఈ దినోత్సవాల ముఖ్యోద్దేశం.భూమి కాలుష్యం సాగరకాలుష్యం,వాయు కాలుష్యం, అంటూ పంచ భూతాలు కాలుష్యానికి గురవుతున్నాయి.
మానవుల అపరిమిత జనాభా పెరుగుదల కారణంగా అడవులు నశించడం,జనావాసాలు పెరగడం జరుగుతున్నది. అందులోను పారిశ్రామీకరణ టెక్నాలజీ వలన ఓజోన్ పొర బలహీనమై ,కొన్నిచోట్ల రంద్రాలు పడి సూర్యుని నుంచి వెలువడే అల్ట్రావయోలేట్ కిరణాలు నేరుగా జీవులపై పడటం మూలంగా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ సమస్యను ప్రస్తుతం మనం అనుభవిస్తూనే ఉన్నాం.వేసవి కాలంలో అత్యదిక ఉస్నోగ్రతలతో భూమి వేడెక్కి పోవడం , మనుష్యలు బయటకు రాలేక పోవటం వంటివి చూస్తూనే ఉన్నాం.వాహనాలు ఫ్యాక్టరీలు వెలువరించే ప్రమదకర వాయువులు గాలిలో కలిసిపోయి ఎన్నో ఉపిరితిత్తుల సమస్యల్ని తెచ్చిపెడుతున్నది. WED ప్రతి సంవత్సరం కొత్త నినాదంతో ప్రజల ముందుకు వస్తున్నది. ఈ కార్యక్రమంలో NGO లను విద్యార్థులను, కమ్యునిటిలను, సెలబ్రిటిస్ను అందరిని కలుపుకొని వారికీ అవగాహన కల్పిస్తూ తద్వారా ప్రజల ముందుకు తీసుకు వెళ్ళడమే ప్రధానం కాలుష్యం పై ప్రపంచానికి ఒక వేదికగా WED ఉపయోగపడుతున్నది.
1974 లో మొదటిసారిగా “ఓన్లీ ఒన్ ఎర్త్ “ అనే నినాదంతో పర్యావరణ దినోత్సవం జరిగిందని తెలుసుకున్నాం కదా!అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కో నినాదంతో WED దినోత్సవాలు జరుగుతున్నాయి. 1975 లో “హ్యుమర్ సెటిల్ మెంట్స్” అనే నినాదంతో బంగ్లాదేశ్ లోని ఢాకా నగరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సమావేశాలు జరిగాయి.
1976 వ సంవత్సరంలో కెనడా దేశంలోని ఒంటారియో నగరంలో WED సమావేశాలు “వాటర్ వైటల్ రిసోర్స్ ఫర్ లైఫ్ “అనే నినాదంతో జరిగాయి. ప్రతి సంవత్సరం ఒక్కో నినాదంతో సమావేశాలు జరుపుతున్నారు. 1977 నుంచి 1984 దాకా బంగ్లాదేశ్ లోని వివిధ ప్రదేశాల్లో పర్యావరణ దినోత్సవ సమావేశాలు జరిగాయి.మరల 1985 లో ఈ సమావేశాలు పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో జరిగాయి.భారతదేశంలో తొలిసారిగా 2011 వ సంవత్సరం లో పర్యావరణ దినోత్సవం జరిగింది.న్యూ డిల్లీలో సమావేశాలు “Foxest Nature at your service”అనే నినాదంతో జరిగాయి.ఆతర్వాత వరుసగా బ్రెజిల్ ,మంగోలియా,బార్బడస్, ,ఇటాలి ,అంగోలా,కెనడా దేశాలలో పర్యావరణ దినోత్సవాలు జరిగాయి.మరల 2018 లో భారతదేశంలోని న్యూ డిల్లి నగరంలో Beat Plastic Polutionనినాదంతో ముందుకు వచ్చింది.ప్లాస్టిక్ మనకు ఎంత ప్రమాదకరంగా మారిందో ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.సముద్రాలలో నదులలో ప్లాస్టిక్ వ్యర్దాలు ఒక పొరలా పేరుకు పోతున్నాయి.అన్ని పదార్థాల్లా ప్లాస్టిక్ విచ్చినమై భూమిలో కలిసిపోదు.ఒకవేళ అలా భూమిలో కలవాలంటే లక్షల సంత్సరాల కాలం పడుతుంది. ఈ లోపల భూమి మొత్తం ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు ప్లేట్లు అంటూ వాడి పారేసిన చెత్తతో నిండిపోతుంది.ఈ వ్యర్థాల వల్ల మానవ మనుగడ అసాద్యం అవుతుంది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవ గీతంగా కె అభయ్ రాసిన గీతం ప్రసిద్ది చెందింది. కవి అభయ్ ఈ కవితను రాసి తనే పాడాడు.”అవర్ కాశ్మిక్ బయసిస్ అంటూ సాగే ఈ కవిత భూమి గీతంగా ప్రఖ్యాతి చెందింది.
ప్రస్తుతం ప్రపంచ పర్యావరణ దినోత్సవం చైనా దేశంలో జరుగనున్నది. 2019 వ సంవత్సరం జూన్ 5 వ తేదిన
ఎయుర్ పోల్యుషన్ అనే నినాదంతో మన ముందుకు రాబోతున్నది. ప్రస్తుతం వాహనాలు సంఖ్యా పెరగడం ,పారిశ్రామిక ప్యాక్టరిలు పెరగడం వలన వాయు కాలుష్యం ఎక్కువగా జరుగుతున్నది.భవిష్యత్తులో మనం ఆక్సిజన్ సిలిండరును వెంటబెట్టుకొని తిరిగే అవసరం రావచ్చానిపిస్తుంది.దగ్గర దగ్గర గా ఉన్న ప్రదేశాలకు నడిచి వెళ్ళడం లేదా సైకిళ్ళను ఉపయోగించడం చేస్తే వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఒక్కరు మాత్రమే ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కారును వాడకుండా బస్శులో ప్రయాణించడం ఉత్తమం.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాల సందర్భంగా నైనా వాతావరణంలో లోని కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేద్దాం.అది మన భవిష్యత్తు కు ముందు తరాల వారికీ స్వచ్చమైన గాలి నీరు భూమి ఆకాశం ఉండటానికి మన వంతు కృషి చేద్దామని ప్రతిన పునుదాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి