" వాక్యం రసాత్మకం కావ్యం... కావ్యేషు నాటకం రమ్యం !";- కోరాడ నరసింహా రావు !

 మనిషి సంచారజీవితానికిస్వస్తి చెప్పి,నదీపరీవాహక ప్రాంతాల లో స్థిరనివాసాలేర్పరచుకుని.... 
కూటికి,గుడ్డకు,గూటికియాతన పడే స్థితిని అధిగమించిన తరు 
వాత...ఆనందంకోసం,ఆనందాన్నిచ్చేలలితకలకోసంఆలోచించ టం మొదలుపెట్టాడు !
      లాలిపాటలు, జోలపాటలు 
శ్రామిక గీతాలతో మొదలై, జన 
పదాలలో..ఒగ్గుపాటలు,దాసరి 
పాటలు, బుర్రకథలు, హరికథ లు మెదలైన కళారూపాలతో విస్తరించి...నాటకాలతో జానప దులు  వినోదాన్నీ, విజ్ఞానాన్ని పొందే స్థితికి చేరుకోవటం నిజం గా మనిషి గొప్పతనమే !
     నాటకం నవరసభరితం !
మొదట్లో నాటకాలు పౌరాణికా ల్లోనే వచ్చినా పిదప చారిత్రిక, జానపద,సాంఘిక నాటకాలతో
ఈ కళ బాగావిస్తరించి చాలాకా లం  గ్రామీణులనే గాక పట్టణ వాసులనూ రంజింప జేసింది !
   నాచిన్నతనంలో...అప్పుడప్పుడూ సినిమాలతో పాటు హరి కథలు,బుర్రకథలు మాఅమ్మతో కలిసి  రాత్రి భోజనాలయ్యాక చుట్టుప్రక్కల వీధుల్లోఎక్కడైనా జరిగితే వెళ్లి చూసేవాడిని ! 
  ఆరు, ఏడు తరగతులు చదివే
నాటికి మా ఊరిలో హరికథలు బుర్రకథలుపూర్తిగాతగ్గిపోయాయి ! మా పార్వతీపురం టౌన్ యువజనసంఘంలో..సాంఘిక
నాటకాలు...ఓలేటిబుచ్చిబాబు గారు,దోమాలసూర్యనారాయణగారు,ఇద్దరూఉపాధ్యాయులే వీరిద్దరూ కలిసి మంచి, మంచి సాంఘిక నాటకాలు, నాటికలు వేసేవాళ్ళు వాల్లటీములో sn. అని పెయింటర్,మంచి యాక్టర్ కూడా,వీళ్ళంతాకలిసి సాంఘిక నాటకాలు వేసేవారు ! ఆరోజు ల్లోనే కాశీవిశ్వనాధ్ రచించిన మంచు బొమ్మలు నాటకం పావలా శ్యామల హీరోయిన్గా నటించారు,చూసాను, నాటకం 
బాగానచ్చింది !ఆ యువజన సంఘంలోనే మరెన్నో నాటకా లు, నాటికలు చూసే అదృష్టం కలిగింది !
  ఆరోజుల్లోనేపీసపాటి,షణ్ముఖ
ఆంజనేయ రాజుల పాండవ ఉద్యోగ విజయాలు, కృష్ణ రాయభారం నాటకాన్ని మాఊరి నవరత్నాధియేటర్ లో... అది టికేట్  ప్రోగ్రామ్... 
ఆఖరిలో అందరినీ ఫ్రీగా వదిలేస్తే నేనూ వెళ్లి చూడగలిగాను ! ఆఖరిలో ఒక్కో పద్యాన్నీ ప్రత్యేకించి రెండేసి మార్లు పాడించుకుని ప్రేక్షకులు చాలా ఆనందాన్ని అనుభవించారు !
  ఆ రోజు ల్లోనే ఆచంట వెంకట రత్నంనాయుడు స్టేజ్ పై అత్యద్భుతంగా నటించిన దుర్యోధన పాత్రను చూసాను !
 ఇంకో గొప్ప నటుడు... పే రు గుర్తులేదు... తులసీజలంధర, మోహినీ భస్మాసుర నాటకా లనుకూడా చూసే అదృష్టం కలిగింది ! బొర్రా సుభ్రమణ్య శాస్త్రి గారి అద్భుతనటన లో
చింతామణి నాటకాన్ని చూడగలగడం నా అదృష్టం నాటకాలలో ఆడవేషం వేసే మగవారు, మగవేషంవేసే ఆడవారుకూడా ఉన్నారు !
పార్వతీపురానికి ప్రక్కనే బాలగూడబగ్రామానికి చెందిన మంగ  ఈమెహరిశ్చంద్రపాత్రను 
వేసి మెప్పిస్తే గుల్లిపల్లి చింతిరుపతి రావు మాస్టారు చంద్రమతి పాత్రను వేసి  పదుగురినీ ఒప్పించారు !
సినిమాలతో పాటు వీరందరి ప్రేరణ మూలంగానే నేను.... 
రావణ, దుర్యోధన ఏకపాత్రలను నేర్చి ప్రదర్శించి పలువురి ప్రశంసలను పొందగలిగాను !
నాటకమంటే చాలా వ్యయ, ప్రయాసలతో కూడుకున్నది ముఖ్యంగా పౌరాణిక నాటకాలు నేర్చాలంటే హార్మోనిష్ఠును పోషించగలగాలి ఆహార్యానిమి, రంగాలంకరణ కూ ఖర్చుపెట్టగలిగే ఆర్ధిక స్తొమత ఉండాలి !... సురభి నాటక సంస్థను అంతకాలం అంత విజయవంతంగా వారెలానడిపారో... వారికి జోహార్లు !
సాధారణంగా నాటకం అంటే.. మంచి సందేశాత్మకమైన కథ, 
ఉదాత్త, ధీరోదాత్త నాయకపాత్ర, రూపవతి, గుణవతి యైన నాయిక తో.. శృంగార, వీర రసాలలో ఏదైనా ఒకరసం ప్రధానంగాను, హాస్య రసం తో కలిసి దోష రహితంగా గుణ సహిత ప్రదర్శన యే మనోరంజకము, ఆమోదయోగ్యము !
సినిమాలకు మూలం నాటకమే ఐనా ఈ రోజు నాటకం మరుగున పడిపోయే దుస్థితి రావటం దురదృష్టకరం !!
   *******

కామెంట్‌లు