బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి ప్రతి ఒక్కరి బాధ్యత;-వెంకట్ :మొలక ప్రతి నిధి వికారాబాద్ జిల్లా

 పిల్లలను పనులకు కాకుండా బడులకు పంపాలని తాండూరు డీఎస్పీ జి. శేఖర్ అన్నారు. ఆదివారం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినో త్సవం సందర్భంగా చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికను డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం డీఎస్సీ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరు భాగస్వాములు కావాలన్నారు. బాలకార్మిక చట్టానికి వ్యతిరేకంగా పరిశ్రమలు గాని, వ్యాపారులు గాని పిల్లలను పనుల్లో పెట్టుకోరాదని అన్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడ వారిని పనులకు కాకుండా బడిలోకి పంపాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు అందరు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబు, కార్మిక శాఖ అధికారి సంతోష్ రెడ్డి, చైల్డ్ లైన్ 1098 డివిజన్ ఇంచార్జ్ వెంకటేష్, సిబ్బంది వెంకటేష్, హన్మంత్ రెడ్డి, నర్సింలు, జ్యోతి, రమేష్, సోషల్ వర్కర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు