సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 గడిచిన... నిలిచిన...
   ******
చాలా మంది గడిచిన కాలాన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటారు.
చేజేతులా జారవిడుచుకున్నామనీ, ఏమీ చేయలేక పోయామనీ,అలా జరుగకుండా ఉంటే బాగుండేదనీ,ఎందుకిలా జరిగిందని  రకరకాలుగా తలపోస్తూ బాధ పడుతూ ఉంటారు.
ఎంత వగచినా గడచిన కాలం ఎలాగూ తిరిగిరాదు.చెయి జారిన కాలాన్ని తలచుకోవడం నిష్ప్రయోజనం.
గడిచింది మనది కాదనుకుని, గడవబోయే కాలం ఎలా వుంటుందో తెలియదు కాబట్టి,మన ముందు నిలిచిన కాలాన్ని వదిలేయకుండా సద్వినియోగం చేసుకోవాలి.
మన ఎదుట నిలిచిన కాలమే ఆశలకు ఆలంబన, మంచి రోజులకు ప్రేరణ అవుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏



కామెంట్‌లు