అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయుటకు ముందుకు రావాలి౼డా.తెలుగు తిరుమలేష్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు,అమరచింత మండలం.
 \నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా...
==========================================
నిరంతరం రక్తదాతలను ప్రోత్సహిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా  చైర్మెన్ ఖాజాఖుతుబుద్దీన్ గారి కృషికి అభినందనలు. 
        సమాజ అవసరాల,ప్రజల ఆరోగ్య దృష్ట్యా అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి. రక్తదానం ఆరోగ్యానికి కూడా మంచిది. రక్తదానం చేస్తే బలహీనంగా మారతామనేది అపోహే. రక్తదానం చేసినా, చేయకపోయినా మన శరీరంలో రక్తనాళాలు కొద్ది రోజులకు నశించడం, కొత్తవి ఉత్పత్తి కావడం జరుగుతూనే ఉంటుంది....నేను డిగ్రీ లో ఉన్నప్పుడు మొదటి సారిగా రక్తదానం చేశాను.ఇప్పటి వరకు దాదాపుగా 24సార్లు రక్తదానం చేశాను... అలాగే వనపర్తి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా సభ్యులు గా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు, రక్తదాన  శిబిరాలను నిర్వహించి రక్తదాతలను ప్రోత్సహించడం జరిగినది.నిరంతరం రక్తదాతలను ప్రోత్సహిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా  చైర్మెన్ ఖాజాఖుతుబుద్దీన్ గారి కృషికి అభినందనలు. 
       మనిషి తన జీవితకాలంలో 168 సార్లు రక్తాన్ని దానం చేయవచ్చు.ఆరోగ్య కరమైన వ్యక్తి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య కాలంలో మూడు నెలల కోసారి రక్తాన్ని దానం చేసినట్లయితే 168 సార్లు తన జీవిత కాలంలో ఇవ్వవచ్చు. దీనివల్ల ఎలాంటి బలహీనతరాదు. ఒకసారి రక్తదానం చేసినట్లయితే దానితో నలుగురి ప్రాణాలను కాపాడవచ్చు. వాస్తవానికి ఒక వ్యక్తిలో ఆరు నుంచి ఏడు లీటర్ల రక్తం ఉంటుంది. అందులో ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి కేవలం 250 నుంచి350 మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు. ఇది కేవలం రెండు వారాల్లో తిరిగి శరీరంలో ఉత్పత్తి అవుతుంది.
      కాబట్టి రక్తదాతలు రక్తాన్ని దానం చేసి ప్రాణాలను కాపాడండి.తీవ్రంగా కొరత ఉన్న రక్తాన్ని దానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడినవారమవుతాం...
రక్తదానం చెయ్యండి... ప్రాణదాతలు అవ్వండి

కామెంట్‌లు