బతుకు పుస్తకంలోఓ అపారమైన అనుభవ సారంఆ రూపం అనంత ఆత్మవిశ్వాసంతప్పులు సరిదిద్దే మండే అగ్నిగోళంనిత్య సత్యాలు బోధించే ఆత్మ బంధువు!సంసార సంద్రాన ఎగిసిపడేసుఖ దుఃఖాలలు దాటుకుంటూదరి చేర్చే చక్కని చుక్కాని నాన్నరెక్కలు ముక్కలు చేసుకొనినెత్తురు చెమటగ మార్చే శ్రమయోగి!అమ్మ గర్భాన ఆశయాల విత్తులు చల్లిఆశల సిరుల పంట పండించిఆకాంక్షాకలి తీర్చే త్యాగధనుడు!వెన్నుతట్టి లేపి వేలుపట్టినడిపించే కరుణామూర్తి!తప్పటడుగులు తప్పించిమంచి నడత నేర్పే శిక్షకుడుదినదినం బిడ్డల ప్రగతికి చేదోడైఅహరహం కనురెప్పలా రక్షకుడువిశ్వ కుటుంబానికి వెన్నెల పంచే జాబిలి!బాధ్యతకు భరోసా క్రమశిక్షణకు ప్రతీకఅమ్మ అదృశ్యమైనా.....!అన్నీ తానై నిలిచే ఆదర్శ మహర్షి!కరుగుతూ వెలుగు పంచే క్రొవ్వత్తిమాయా మర్మం తెలియనిమకుటం లేని మహా రాజయ్యా!కాలంతో పాటు తరాలుఅంతరాలు మారుతున్న వైనంరెక్కలొచ్చి రివ్వున ఎగిరే పుత్రరత్నాలుఅనురాగ మేఘానికై చకోర పక్షిలాఎదురు చూసే సత్య శోధకుడు!నటన తెలియని నాన్నే నా హీరోవణికే అమృత హస్తాలను ఆదరిద్దాంచేయూత నిచ్చి చేరదీద్ధాం!రండి! కనిపించే దైవం పాదాలుపవిత్ర గంగాజలంతో అభిషేకిద్దాం!!(Father's Day సందర్భంగా..)
నాన్నే నా హీరో;- కవిరత్న నాశబోయిన నరసింహ(నాన),ఆరోగ్యపర్యవేక్షకుడు, NVBDCP సికింద్రాబాద్, 8555010108
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి