నానీ లు ;-ఎం. వి. ఉమాదేవి
1)
పట్టాలపై 
సంసారం రైలు 
కాసేపు బ్రాడ్ గేజి 
 మళ్ళీ మీటర్ గేజి !
2)
సిగిరెట్లు మానేయడం 
 కష్టమే 
ఇష్టాన్ని వొదిలేస్తే 
ఏదైనా సాధ్యమే !
3)
మనిషి చెట్టుపై 
పొగడ్తల గిజిగాళ్ళు 
నైపుణ్యం 
అల్లిన వాళ్ళదే !
4)
తెలివెక్కువై 
భూమినే మార్చాడు 
మనిషితనం 
ఏమార్చాడు !
5)
కొలతలకు 
సాధనాలెన్నో 
కష్టసుఖాలకు 
మనసే కదా !!

కామెంట్‌లు