ఝాన్సి లక్ష్మి బాయ్; లత శ్రీ
కాశీలో పసి బాలగా జన్మించిన మణికర్ణిక
కొదమ సింహంలా వేటాడిన యవనిక
కత్తి సాము గుర్రపు స్వారీ తుపాకీల జట్టిక
భారతదేశ జోన్ ఆఫ్ ఆర్కగా ముద్రిక లక్ష్మి బాయ్

ఖడ్గం ధరించి కళ్లెం బిగించి గుర్రపు స్వారీ చేస్తే 
రాణి కురులే సింహపుజూలై ఎగిరే ఉవ్వెత్తుగా
దామోదర్ రావుకు తల్లై పెంచిన సుధతి 
ఇన్ ద గ్రేట్ గేమ్ చారిత్రాత్మక కల్పిత కథ హీరో తను

భారతదేశయ శూరురాలు లక్ష్మీబాయి
మొదటి తిరుగుబాటుకు ఎగురవేసే బావుటా
యుద్ధ సేనలను శిక్షణనిచ్చిన సైనికుడు 
తన రాజ్యాన్ని వదిలి వెళ్ళనని భీష్మ ప్రతిజ్ఞ పూనిన ధీరవనిత

భారతదేశ నా పున్నమిపువై విరిసింది
వెన్నెల గువ్వై విహరించ స్వాతంత్రానికై పోరాడింది 
యుద్ధంలో వీరమరణం చెందిన  అగ్ని పునీత 
భారతి మెడన మణికర్ణికై  మెరిసిన పుత్రిక

కామెంట్‌లు