బోనాలు! అచ్యుతుని రాజ్యశ్రీ హైదరాబాద్
 ముచ్చటగా ముదితలు!
పట్టుచీర రెపరెపలు!
నెత్తిన కుండలు!కుంకం పసుపు పూతలు!
చుట్టిన వేపమండలు!
పైన వెలుగు దీపాలు
లోన బోనం బువ్వలు!
కాలిఅందెల రవళులు
ఆషాఢంలో గోల్కొండతో ప్రారంభం!
ఉజ్జయిని మహంకాళి ఎల్లమ్మ 
పోచమ్మ మైసమ్మ!
పోతరాజు తమ్ముడంట
శివసత్తుల విన్యాసాలు!
అంబరాన్ని అంటే సంబరాలు
తెలంగాణా జాగృతి వికాసాలు
తొట్టెల ఊరేగింపు-భవిష్యవాణి
పచ్చికుండ నెక్కు!
ప్రకృతి .పండగ!రంగుల సింగడీల పండగ!
...స్వస్తి...

కామెంట్‌లు