ఆత్మ న్యూన్యత! అచ్యుతుని రాజ్యశ్రీ
 టీచర్ ఇంగ్లీష్ పోయెం చదువుతూ వివరిస్తోంది. ఆమె  రైమ్ రిథంతో పాడుతూ వినిపిస్తోంది. రాము పెదాలు కదుపుతూ పక్కవాడి చెవిదగ్గర మాట్లాడటం చూసింది. "ఏంటి గొణుగుతున్నావు?" వాడు నోరెత్తలేదు. వాడికి అసలే భయం కాస్త నత్తి! కానీ ఇంట్లో అమ్మ వాడిని అద్దం ముందు నించోపెట్టి నీఇష్టం వచ్చినట్లుగా మాట్లాడు అని ప్రోత్సహిస్తుంది.చిన్న శ్లోకాలు పద్యాలు నేర్పి వాటిని వల్లెవేయమంటుంది.కానీ ఇప్పుడు టీచర్ ఒక్కసారిగా గద్దించే సరికి నత్తిగా మాట్లాడాడు.అంతే పిల్లలంతా ఫక్కున గల గలా నవ్వారు. అంతే !టీచర్ వాడిని తన దగ్గరకు పిల్చి చేయిపట్టుకుని లాగి వాడి వీపు నిమురుతూ"చూడు!నీలో ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ బాగా పెరిగిపోయింది. "అంటూ క్లాస్ మొత్తాన్ని  నించోపెట్టింది."మనిషికి బలహీనతలు ఉంటాయి. క్లాసులో గొణుక్కుంటూ ఉంటే ఎలా?""టీచర్!నేను..మీలాగా..పో..యె..మ్..చదవాలని..ప్రయ..త్ని..స్తు..న్నాను". నించున్న పిల్లలు మళ్లీ కిసుక్కున నవ్వారు. అప్పుడు  టీచర్  వారికి  కథ చెప్పింది.రాము ని తన దగ్గర నిలబెట్టింది."ఆసర్కస్ వారు  ముసలిదై కళ్ళు కన్పడని పులిని ఓ అటవీప్రాంతంలో వదిలి తమదారిన తాము వేరేప్రాంతానికి వెళ్లారు.ఇన్నాళ్ళు బోనులో నిస్సహాయంగా ఉండిపోయిన ఆపులి ఒక్క సారి గా భయంతో హడిలి పోయింది. రింగ్ మాష్టర్ ఆడించినట్లు ఫీట్స్ చేసిన పులి ఇప్పుడు తన శక్తి సామర్ధ్యాలు మర్చిపోయి నీరసంగా పొదలవైపు అడుగు వేస్తోంది. కళ్ళు కనపడక గోతివైపు జారింది.హఠాత్తుగా అడవికుక్కలు దానిమీద దాడిచేసి చంపేశాయి.అంటే దాని శక్తిని అది మర్చిపోయింది.తను పనికిరాని దాన్నని సర్కస్ జీవితం నిరాశగా ఆలోచించేలా చేసింది  అన్న మాట!పిల్లలూ!రేపు పైచదువులకి కొత్త ప్రాంతం కి వెళ్లితే భయపడ్తే ఏమి సాధించలేరు."అని రెండు సార్లు  రాముచేత మిగతావారినీ చదివించింది.అంతా తప్పుల తడకలే చదివారు.ఇకనించీ ప్రతి శనివారం  పిల్లలు తామే ఒకపేరా చదివి వివరించేలా  అందరు టీచర్లు నిర్ణయించారు. మహాతెలివిగలవారం అన్న పిల్లలు తప్పుల తడకతో బైటపడ్డారు.రామూ తెలుగు హిందీ ఇంగ్లీషు  చక్కగా రాగయుక్తంగా చదువుతూ బహుమతి అందుకున్నాడు. ఆత్మ విశ్వాసం ఉంటే  మనం ఏదైనా సాధించగలం🌹

కామెంట్‌లు