*రుబాయీలు ; --ఎం. వి. ఉమాదేవి

 1)
పాపమేది పుణ్యమేది తెలుపగలుగు తత్వమేది? 
మంచిచెడులు త్రాసులోన తూచగలుగు తత్వమేది? 
తనకుతాను తెలియనిదే లోకమేమి తెలుసు ఉమా 
నిజాయితీ నీడలోన నిలుపగలుగు తత్వమేది? 
2)
మెరుపుల లోగల తళుకే  ప్రేయసి 
తలపుల దాగిన కులుకే ప్రేయసి 
అటుయిటు కానిది  నమ్మకమే ఉమ 
మౌనం వీడిన పలుకే  ప్రేయసి !!
కామెంట్‌లు