ఆవేశం అనర్ధదాయకం; - సి.హెచ్. ప్రతాప్
 పూర్వం మగధ దేశంలో రామానందులనే ఒక గురువు వుండేవారు.ఆయన నలుగు వేదాలు, సకల ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలను ఔపాసన పట్టిన దిట్ట. ఊరికి దూరంగా ఒక అడవి సమీపంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని అందులో శిష్యులకు విద్యాబోధన చేస్తుండేవారు.ఆయనను త్రికరణ శుద్ధిగా నమ్మి, అహర్నిశలు సేవలు చేస్తూ, చిత్తశుద్ధితో చదువుకునే శిష్యులకు అద్భుతమైన మేధాసంపత్తి తో పాటు శాస్త్ర పరిజ్ఞానం అబ్బి దేశంలో ఇతర రాజ్యాలలో మంచి కొలువులలో స్థిరపడేవారు.
మగధ దేశంలో రామాపురం అనే ఒక గ్రామంలో ఆరణి అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. చిన్నప్పటి నుండి తండ్రి వద్ద శిషరికం చేసి వేదాలు నేర్చుకుంటున్న ఆరణికి తండ్రి నుండి రామానందుల యొక్క ప్రతిభాపాటవాలను గురించి విని ఎలాగైనా ఆయన వద్ద శిష్యరికం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆరణికి గ్రహణ శక్తి ఎక్కువే అయినా నిగ్రహం,సహనం చాలా తక్కువ. అంతేకాకుండా ప్రతీ చిన్న విషయానికి  కోపం తెచ్చుకుని ఎదుట ఎవరున్నది చూసుకోకుండా అరుస్తుండేవాడు. ఆరణిని ఈ స్వభావం మార్చుకోమని, తన కోపమే చివరకు తన శత్రువు అవుతుందని  అతని తండ్రి ఎన్నిసార్లు చెప్పి చూశాడు కాని లాభం లేకపోయింది.
తల్లిదండ్రుల అనుమతితో ఆరణి రామానందుల గురుకులానికి చేరుకొని తనను శిష్యునిగా స్వీకరించమని అర్ధించాడు. తొలి చూపులోనే శిష్యుని శక్తి సామర్ధ్యాలు గ్రహించిన గురువు మొదట అతని బలహీనతలను పోగొట్టాలని నిర్ణయించుకున్నారు. "నాయనా, నిన్ను శిష్యులుగా స్వీకరించాలంటే ముందు నువ్వు కొన్ని సాధనలు చేయవలసి ఉంటుంది. నీ దైనందన చర్యలలో నీ ఇష్టదైవం నామం జపిస్తూ వుండు. ఒక నెల తర్వాత గంగలో స్నానం చేసి తిరిగి రా!" అని  చెప్పారు.ఆ ఆశ్రమానికి దగ్గరలో వున్న ఒక సత్రంలో గది అద్దెకు తీసుకుని గురువు చెప్పినట్టు ఆరణి చేయసాగాడు.ఒక నెల తర్వాత గంగా నదిలో స్నానం చేసి గురువు ఆశ్రమానికి బయలుదేరాడు. దారిలో ఒక పనివాడు ఆ రహదారులు శుభ్రం చేస్తూ నిర్లక్ష్యంగా దుమ్మును ఆరణిపై పోసాడు

ఆరణికి కోపం వచ్చి ఆ పనివాడిని నానా దుర్భాషలాడాడు., 'ఏం చేస్తున్నావ్, మూర్ఖుడా? ఇప్పుడు నేను తిరిగి వెళ్లి ఈ బట్టలు ఉతికి ఆరబెట్టి మళ్ళీ స్నానం చేయాలి! ఇంత సమయం నీ వలనే దండగ అయ్యింది.పని చేసేటప్పుడు ముందు వెనుక చూసుకో నక్కరలేదు ? ఎంత కొవ్వెక్కి వుండకపోతే నువ్విలాకన్నుమిన్ను కానక ప్రవర్తిస్తావు!' గురువు ఆ దృశ్యాన్ని గమనించి, ఆరణి ఆశ్రమానికి చేరుకున్నప్పుడు, “ నాయనా! నీలో ఇంకా ఆగ్రహావేశాలు చల్లారలేదు. నీ   కోపానికి నువు శిక్షింపబడవు..నీ కోపంతో నువ్వు శిక్షింపబడతావు.. నీ జీవితంలో, నువ్వు కోపంతో శిక్షించబడరు, నువ్వు రు చూపించే కోపం పరోక్షంగా నిన్నుశిక్షిస్తుంది. అందువల్ల, కోపం లేకుండా ప్రశాంత జీవితాన్ని గడపడానికి ప్రయత్నించు. నీ కోపం చల్లారనిదే , దానిపై నీకు పూర్తి నియంత్రణ రానిదే నిన్ను నా శిష్యునిగా అంగీకరించలేను కాబట్టి నువ్వు  ఇంకా ఆధ్యాత్మిక సాధన కోసం సిద్ధంగా లేవు. కాబట్టి ఇంకో నెల రోజుల పాటు నీ పనులు చేస్తున్నప్పుడల్లా భగవంతుని నామం జపించి, ముగిశాక స్నానం చేసి నా దర్శనానికి రా.' అని చెప్పి ఆరణిని పంపేసారు.
ఒక నెల తర్వాత, అతనుఉత్సాహంగా తన గురువు ఆశ్రమానికివెళ్లాడు మళ్ళీ అదే  సంఘటనపునరావృతమైంది. ఆరణి కి మళ్లీ కోపంవచ్చి పనివాడిని నిందించాడు. స్నానం చేసిన తరువాత, అతను తన గురువునుకలుసుకున్నాడు. ఆయన ఒక నెల పాటుదేవుని నామాన్ని జపించమని ఆరణి ని కోరాడు. ఒక నెల గడిచింది
ఈసారిఆరణి తన గురువును కలవడానికివెళ్లినప్పుడు అదే సంఘటన జరిగింది.అయితే దైవ నామం జపించడంవలనో, లేక తనలోని ఆగ్రహంఅనే బలహీనతను ఎలాగైనా జయించాలన్న పట్టుదల , ఆరణి ఆ పనివాడితో" ఇంతకాలం నిన్ను ఒళ్ళు తెలియని కోపంలో నిందించినందుకు క్షమించు. నువ్వు నాకు నిజం గాఎంతో ఉపకారం చేసావు. నీ చర్యల కారణంగానా కోపాన్ని అదుపులో పెట్టగలిగాను. అందుకు నీకు శతకోటి ధన్యవాదాలు"అని ఆ పనివాడి పాదాలకునమస్కరించాడు. తర్వాత ఆరణి రామానందుల ఆశ్రమంలోఅడుగుపెట్టినప్పుడు గురువే స్వయంగా ఎదురొచ్చి ఆరణికి స్వాగతం పలికారు. "నీ బలహీనతలను జయించడం లో నువ్వు సంపూర్ణంగా విజయం సాధించావు.నిన్ను నా శిష్యునిగా స్వీకరిస్తున్నాను"అన్ ఆరణిని మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకున్నారు.ఆయన శశ్రూషలో ఆరణి సకల విద్యా పారంగతుడయ్యాడు.

కామెంట్‌లు