బెలా దేవేషియా; -డా.. కందేపి రాణీప్రసాద్.

 మా ఇంటిని పసుపు రంగుతో ముంచెత్తుతున్న ‘ కాస్కాబెలా దేవేషియా ‘ అనే చెట్టును మీకు పరిచయం చేస్తున్నాను. తోటలకు ఉద్యానవనాలకు పసుపు రంగునద్దే ‘ దేవేషియా ‘ అనబడే ‘ పచ్చ గన్నేరు ‘ చెట్లు ఎంతో అందంగా ఉంటాయి. సూటిగా కొనదేలిన ఆకులు గంట ఆకారంలో ఉందే పువ్వులు కళ్ళకు ఆహ్లాదాన్నిస్తాయి. మా ప్రహరి గేటు పక్కన నిలబడి బిల్డింగ్ కు పసుపు పూలు డిజైన్ వేస్తూ ఉంటుంది. ఆసుపత్రికి వచ్చే చిన్నారుల పై పూవునొకటి రాల్చి త్వరగా జ్వరం తగ్గాలని ఆశిర్వదిస్తుంది.
ఇది ‘ అపోసైనేసి ‘ కుటుంబానికి చెందిన పూల చెట్టు. వీటి జన్మస్థలం మెక్సికో, క్యూబా, సెంట్రల్ అమెరికా, దక్షిణ అమెరికా దేశాలు. ఈ చెట్టు మామూలు గన్నేరు చెట్టుకు దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఇందులో దేవేషియా పెరూవియానా, దేవేషియా లీనియారిస్, కాస్కాబెలా పెరువియానా వంటి ఎన్నో జాతులున్నాయి. వీటి ఆకులు మైనం పూసినట్లుగా ఉంటాయి. అందువలన వీటిపై వాన చుక్కలు ఆగవు. ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. నీటి కరువును తట్టుకుంటుంది ఈ చెట్టు భాగాలన్నీ విషపూరితం భారత దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని బతుకుతుంది.
ఎల్లో బలియాండర్, లక్కీ నట్ అని పిలిచే ఈ చెట్టు ఆకులు మెరిసే ఆకుపచ్చ రంగుతో ప్రత్యేకంగా కనిపిస్తాయి తెలుపు, పసుపు, ఎపిక్రాట్ రంగుల్లో పూవులు పూస్తాయి. కాయలు చిన్న ఉసిరి కాయల్లా ఉంటాయి. ఎండిపోయిన విత్తనాలు త్రి కోణం ఆకారంలో ఉంటాయి. బయోలాజికల్ పెస్ట్ కంట్రోల్ గా ఈ చెట్టును ఉపయోగించవచ్చు. ఈ విత్తనాలు నూనెను యాంటి టేర్మైట్ గా పూస్తారు. మూడు మీటర్ల నుండి 10 మీటర్ల దాకా పెరుగుతుంది. చిన్న పొదలా ఉంటుంది. లినియర్ ఆకులు కాండం చుట్టూ రా సర్పిలాకారంగా అమరి ఉంటాయి. పూలు, ఆకులు రెండూ అలంకారం కొరకు వాడతారు.
సాధారణంగా దీనిని డాఫోడీల్ బుష్, బీస్టిల్ ట్రీ ట్రంపెట్ ఫ్లవర్, జేటుంగ్ అనే పేర్లతో పిలుస్తారు. దీనిని హిందీలో ‘కనేర్ ‘ అని పిలుస్తారు. స్పానిష్ లో కోజోస్ డి గాటో కోడో డిప్రైల్, యోయోట్లి అనే పేర్లున్నాయి. మొక్కలోని అన్ని భాగాలూ విషపూరితమైనవి. ఆకుల్ని తుంచినట్లైతే పాల వంటి ద్రవం కారుతుంది. కన్నడ భాషలో ఈ చెట్టును “ కాడుకాశి కనగలు, అని బెంగాలీ లో ‘ కొల్కా ఫుల్ ‘ అని మణిపురి భాషలో ‘ ఉటోంగ్లి ‘ అని పిలుస్తారు. కొమ్మల ద్వారా చెట్టును నాటవచ్చు. విత్తనాలు రాయిలా ఉంది కాయలో రెండుంటాయి. కాండం ఆకుపచ్చగా ఉన్నప్పటికీ చెట్టు వయసు పెరిగే కొలదీ నలుపు రంగుకు మారుతుంది. 
కామెంట్‌లు