జీవితం!!?;- ప్రతాప్ కౌటిళ్యా
రక్త మాంసాల ముద్ద రూపంలో
ఉన్నదే సమయం!!
సమయమే నీ జీవితం!!?

నీవు ఒకరికి సమయమిస్తున్నావంటే
నీ జీవితం ఇస్తున్నట్లు

సమయాన్ని మించి జీవించలేవు
సమయాన్ని మించి జీవితం లేదు

నీ సమయాన్ని నీకిస్తే
నీవు నీతోనే ప్రేమలో పడ్డట్లు

నీ సమయాన్ని ఎవరికిచ్చిన
వారితో ప్రేమలో పడ్డట్లు

సమయం అంటే నరుడు
సమయం అంటే యముడు
ఒకరినొకరు
ఎప్పుడు గెలవలేరు!!?

సమయానికి వచ్చేవాడు
సూర్యుడు చంద్రుడు
సమయానికి వచ్చేవాడు
వాడే వీరుడు!!!?

సమయానికి నచ్చినవాడు నరుడు
ముల్లోకాల్లో మూడు సమయాల్లో
జీవించేవాడు మానవుడు!!?

సమయానికి వీడ్కోలు 
సమయానికి ఆహ్వానం
సమయమే జీవితం!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు