బ్రహ్మ, నారద సంవాదంలో.....
*బ్రహ్మ రుద్రుని తో సతీదేవి ని పరిణయమాడమని అడగడం - విష్ణువు ఆమోదముతో వివాహం జరగడం *
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -*
*రుద్ర దేవా నీవు సదాశివుని హృదయం నుండి పుట్టావు. విష్ణువు, నేను సదాశివుని దివ్యమైన అంగముల నుండి పుట్టాము. అందువల్ల నీవు పరిపూర్ణమైన శివ రూపానివి. రుద్రదేవా ఈ సమయములో నీవు మా ఇరువురికీ "నేను సగుణ రుద్ర రూపుడనై సంహార కార్యము జరిపించుదును. ఒక స్త్రీని వివాహ మాడి ఈ మానవ లోకము యొక్క ఒక ఉత్తమ కార్యము సిద్ధింప చేస్తాను" అని మాట ఇచ్చావు స్వామీ. ఇప్పుడు ఆ మాట నిలుపుకొని లోక కళ్యాణం కోసం వివాహం చేసుకోమని ప్రార్థిస్తూ మీ వద్దకు వచ్చాము.*
*బ్రహ్మ దేవా లోక కళ్యాణం కొరకు నా నిరంతర ఆత్మనిరతుడననే తత్వానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంటాను. తగిన కన్యను చూడండి అని చెప్పాడు రుద్రుడు. శివదేవి సతీదేవి గా దక్షుని ఇంట పుట్టింది. ఆమె నీ తేజస్సును విభజించి గ్రహించగల ఉమ. యోగినిగా తాను కోరిన రూపమును పొందగలదు. నీవు యోగ తత్పరుడవు అయినప్పుడు ఉమ సతీదేవి కూడా యోగ తత్పరురాలు అవుతుంది. నీవు కామాసక్తుడవు అయినప్పుడు సతీదేవి కూడా కామినిగా నీతో వుంటుంది. జ్యోతి స్వరూపుడవైన, సనాతనుడవైన నిన్ను ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూనే వుంటుంది. నీ శివచింతనకు గానీ, నీ అస్తిత్వం గానీ ప్రశ్నింపబడిననాడు తాను జీవించి వుండదు.*
*దక్షుని కుమార్తె సతీదేవి గా వెలసిన ఉమ నీకు అన్నివిధాలా తగిన స్త్రీ. ఆమె నీ గురించి ఎన్నో యుగాలు తపస్సు చేసింది. ఆమె తపస్సు కు ఫలంగా నీవు ఆమెను వివామాడి అనుగ్రహించవలసినది. ఈ మీ వివాహముతో ముల్లోకములకు పరమ ఆనందము కలిగి, శ్రేయోదాయకము అవుతుంది. లోకమునందలి బాధలు అన్నీ తొలగి పోతాయి. ఇందులో సందేహము లేదు.*
*భక్తవత్సలుడు అయిన రుద్ర రూప సదాశివుడు సతీదేవి తో వివాహానికి తన ఒప్పుదల తెలియ చేసాక, ఆ మహాదేవునికి దేవగణము మేము ఇద్దరము నమస్కరించి మా మా నివాసాలకు వెళ్ళాము.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి