జెండా మనదేరా;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 జెండా మనదిరా.....
ఈ జెండా మనదేరా.....
కసిని పెంచిన జెండా మనదిరా....
కదిలించిన జెండా మనదేరా....
బానిసత్వపు చెరలను చీల్చగా 
మురిసిన జెండా మనదిరా....
మూడు రంగులను తనలో నింపుకొని 
ముద్దుగా మెరిసిన జెండా మనదేరా....
దొరలను ఎదిరించిన 
జెండా మనదిరా....
దొరలా ఎగిరిన
జెండా మనదేరా....
భారతదేశం యొక్క కీర్తిని చాటిన 
జెండా మనదిరా....
భారతీయుల, ఖ్యాతిని పెంచిన 
జెండా మనదేరా....
ఈ జెండా మనదిరా.....జెండా మనదేరా.....


కామెంట్‌లు