దత్తపదులు:- ;-మమత ఐలకరీంనగర్9247593432
 అప్పు.మెప్పు. తప్పు. నిప్పు
===================
తే.గీ
నిప్పు చేతితో పట్టెడీ కప్పలెపుడు
తప్పుడు సలహాల నిడుచు గొప్పజెప్పు
మెప్పులను జేసినామంటు మేలుగోరి
అప్పుడే మాటమార్చేరు నద్భుతముగ

దత్తపది:- 
కలము.సులువు. కొలను. విలువ
తే.గీ
కలము వణుకదెపుడు కల్మషంబునుజూసి
సులువు గాదు గెలుపు నలతబెంచ
కొలను లోని పూలు వలకెట్లు జిక్కునో
విలువ గలది విద్య బలము గూర్చ

కామెంట్‌లు