ఢిల్లీ రాజధాని పిల్లలం
గల్లీ క్రికెట్ ధోని మల్లెలం
క్రికెట్ ఆడేటి వారలం
క్రెడిట్ కోరేటి పౌరులం !
క్రికెట్ ఆట అంటే మాకెంతో ఇష్టం
వికెట్ పడగొట్టడమే మాకు కష్టం
అయినా పట్టుదలతో సాధిస్తాం
ఏమైనా ప్రత్యర్థిని మేం ఓడిస్తాం !
ఆటలోన తర్ఫీదును తీసుకుంటం
కోటలోని స్టేడియంలో కాసుకుంటం
నేర్పుతోని బంతిని విసురుతుంటం
ఓర్పుతో మా ఆటను ఆడుతుంటం
బ్యాటుకు బంతికి పెడతాం గురి
ఫోర్లు సిక్కులు కొడతాంమేం మరి
పరుగుల వరదను పారిస్తాం సారి
సరుగున ఆటను సరి చేస్తాందూరి!
ధోని సహనం అలవర్చుకుంటాం
మా ప్రతిభను మేం పెంచుకుంటాం
ప్రైజు మనీని ఇక పంచుకుంటాం
సైజు వారి డ్రెస్సుల ఎంచుకుంటాం!
ధోని యువరాజులనూ కలుస్తాం
క్రికెట్ ప్రారంభోత్సవానికి పిలుస్తాం
వారే మాకు స్పూర్తి అని భావిస్తాం
వారిని సత్కరించి మేం తోలుస్తాం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి