పాపము పుణ్యము అన్నవి ఎక్కడో లేవు మన మనసు లోనే ఉన్నాయి. పురాణ ఇతిహాసాలను అనుసరించి పాపం చేస్తే నరకానికి వెళతాడు పుణ్యం చేస్తే స్వర్గానికి వెళతాడు అనే మాట వింటూ ఉంటాం. చిన్నతనం నుంచి పెద్ద వాళ్ళు మనలను హెచ్చరిస్తూనే ఉంటారు. నాన్నా పాపం చేయకు చేస్తే నరకానికి వెళతావు అక్కడ నానా చిత్రహింసలు పెడతాడు జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. ఒకసారి మనం ఆలోచిస్తే మరొక దేశంలోనూ, ప్రపంచం లో ఎక్కడా ఈ నమ్మకాలు ఉండవు. సమాజ హితాన్ని కోరి ఎదుటి వారి కష్టాన్ని అర్థం చేసుకుని అతనికి కావలసిన సాయం నీ శక్తిమేర చేయగలిగితే అది తప్పకుండా పుణ్యమే. దుష్ట ఆలోచనలు వ్యభిచారాన్ని గురించి గానీ, దొంగతనాల గురించి గానీ సమాజానికి కీడు చేసే పని ఏదైనా చేస్తే మనసులో ఆలోచించినా అది తప్పే. ఏ తప్పు చేసినా అది పాపమే ఆర్థిక సౌలభ్యం లేకపోతే వాడు చదువు లేకపోతే అతనికి సహాయం చేసి చదివిస్తే ఆ రోజు మానసికంగా ఎంత ఆనందం పొందుతాం. ప్రశాంతంగా నిద్ర పోతాము. ఆ తరువాత స్వర్గంలో విహరించినంత ఆనందం కలుగజేస్తుంది. భౌతికంగా చేసినా, మానసికంగా చేసినా తప్పు తప్పే. పెద్దలు అరిషడ్వర్గాలను జయించు నీకు ఎలాంటి బాధలు, కష్టాలు ఉండవు అని చెబుతారు భౌతికంగా చేసింది తప్పు అని న్యాయనిర్ణేతలు కూడా చెబుతూ ఉంటారు. మరి మనసులో ఆ నీచ భావం వచ్చి రోజంతా నిన్ను బాధ పెడితే అది నరకం కాదా? ఆ నరకాన్ని చూపించడానికి ఆ యమధర్మ రాజా దిగి రావాలా నీ మనసే నీకు సాక్షి అది ఆనందించాలన్నా బాధపడాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది తప్ప మరొకరికి సంబంధం లేదు. ఎప్పుడు చెడు ఆలోచన వచ్చిందో, ఏదో పద్ధతిలో కార్య రూపంలో చూపకుండా వుండు అది మనసును ఆనందింప చేస్తుంది. అందుకే బుద్ధుడు అంటాడు కోరికలను జయించు అప్పుడు అంతా ఆనందమే అని.
పాపము- పుణ్యము;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి