స్ఫూర్తి. : - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
ఒక విత్తనాన్ని నాటితే 
మహా అయితే 
ఒక మహా వృక్షం అవుతుంది. 
దాన్ని 
గాలికి నీటికి మట్టికి దూరంగా 
గాజు సీసాలో బంధిస్తే 
అది 
గాజుగా మారింది రాజుగా మారింది. 
చివరికి 
అది గాజుల కాదు వజ్రంలా మెరిసింది. 

స్ఫూర్తి పొందడానికి 
మనం విజేతలు నాయకులే 
కానక్కరలేదు 
మంచి ఆలోచనలు ప్రయత్నం ఉంటే చాలు. 

మనకు దొరికింది ఏదైనా 
మట్టి అనుకుంటాం 
మనకు దొరకంది ఏదైనా 
వజ్రం అనుకుంటాం. 

అందని నక్షత్రాల కన్నా 
మన ముందున్న మన చుట్టూ ఉన్న 
మామూలు పువ్వులు మిన్న.!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు