తల్లి ఎరుగు బిడ్డ జన్మంబు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం9492811322
మానవుని మాటలను అంచనా వేయడం మానవుని వల్ల కాదు  అతను నిజం మాట్లాడుతున్నాడో, అబద్ధం మాట్లాడుతున్నాడో అతని మనసుకే తెలుసు మనకు అర్థం కాదు డాబుసరిగా నేను అది చేశాను ఇది చేయాలని అతని గురించి ఎక్కువగా చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటే అతను మాట్లాడుతున్న దాంట్లో ఎంత అబద్ధం ఉందో  మనకు తెలియకపోయినా ఆ ఈశ్వరుడికి తెలియక పోతుందా? ప్రతి అణువులోనూ జీవించే ఈశ్వర స్వరూపం  ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేదా?  నీటి ప్రవాహం వచ్చినప్పుడు ఆ నీరు ఎటు ప్రవహిస్తుంది  ఎక్కడ పల్లం ఉంటే ఆ వైపు వెళ్ళిపోతుంది. దానికన్నా ఎక్కువ లోతైన పల్లపు స్థలం వుంటే ఆ ప్రవాహం అటు ప్రయాణం చేస్తూ ఉంటుంది.  ఇది ప్రకృతి ధర్మం దానిని ఎవరూ కాదనలేరు. ఈ మధ్య చంటిపిల్లలను  దొంగిలించి అమ్ముకోవడం  వ్యాపారంగా చేస్తున్న వాళ్లు కొంతమంది ఉన్నారు. ఈ బిడ్డ నా బిడ్డే నమ్మ  ఆర్థికంగా చాలా కష్టం వస్తే పోషించలేక మీకు ఇస్తున్నాను అని మాయమాటలు చెప్పి  ధనానికి ఆశపడి ఆ బిడ్డను అమ్ముకుంటుంది. నవమాసాలు మోసిన కన్న తల్లి మనసు ఎంత క్షోభ పడుతుంది. గ్రామ పెద్దలకు చెప్పి పరిష్కారాన్ని  చెప్పమని కోరుతుంది. ఆమే కన్న కొడుకు అంటుంది ఈమే కన్న కొడుకు అంటుంది ఎలా నిర్ణయిస్తారు?  రక్త పరీక్ష చేస్తే గానీ తెలియదు, కానీ నిజానికి బిడ్డ జన్మ  కన్నతల్లికి గాక మరెవరిది తెలుస్తుంది. అందుకే  పెద్దలంటారు అమ్మ నిజం,  నాన్న నమ్మకం అని. ఆ విషయాన్ని చక్కగా చెప్పారు వేమన.

"కల్ల నిజము లెల్ల  గరళకంఠుడు ఏరుంగు
నీరు పల్లమెరుగు నిజము గాను
తల్లి తానెరుగును దనయుని జన్మంబు..."



కామెంట్‌లు