బాలనటి వాణి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 పెరవలి గ్రామ పరిసరాలలో ఎవరైనా నాటకాల గురించి మాట్లాడవలసి వస్తే  సత్యనారాయణ రెడ్డి పేరు తప్ప మరొక పేరు వినిపించదు  మంచి రచయిత నటుడు. తన దర్శకత్వ ప్రతిభతో అనేక బహుమతులను సాధించాడు  వ్యవసాయ శాఖలో పని చేస్తున్నాడు  చక్కటి ఆలోచన చేసి  మాతృ సంస్థ కోసం  "కీటక దర్బార్" అన్న నాటకాన్ని  రైతులకు ఉపయోగకరంగా ఉండేలా వ్రాసి ప్రదర్శించారు.  అది తెలిసి మేము రికార్డ్ చేయడానికి వెళ్ళిన రోజు  కథానాయక రాలేదు మమ్మల్ని చూడడానికి వచ్చింది రెడ్డి గారి పాప వాణి. ఆమెతో సాధన చేయించి రికార్డ్ చేస్తే అద్భుతంగా వచ్చింది. ఆ తరువాత కొన్ని నాటకాలలో కూడా నటించింది చదువుల సరస్వతి నాటకాలు గురించి  ఉత్తరాలు రాస్తూ ఉంటుంది  చక్కటి  విమర్శకురాలు నన్ను ఆప్యాయంగా మావయ్య అని పిలుస్తుంది. నాటకం పూర్తయిన తర్వాత దాని రచయిత సత్య నారాయణ రెడ్డి, నేను వేదిక పై ప్రదర్శించిన దాని కన్నా ఇది అనేక రెట్లు అందంగా వచ్చింది అని కొనియాడారు. నా ప్రక్కన వచ్చిన వ్యవసాయ శాఖ అధికారి ఎంతో మురిసి పోయారు.తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో  ఏ నాటక పరిషత్తు  జరిగినా దానిలో సత్యనారాయణరెడ్డి  పాల్గొని  దానిలో అన్ని బహుమతులను కైవసం చేసుకోవడం  అందరికీ తెలిసిన విషయమే. అతను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు  వ్యవసాయ శాఖలో పని చేస్తున్న వాడు కనుక  ఆ శాఖలో ఉన్న మెలకువలను తెలుసుకొని  సాంకేతిక పరిజ్ఞానంతో  తనే చక్కటి రచన చేయడం  దానికి తగిన  నటీనటులను ఎన్నుకొని  వారి ఇంటి వద్దనే సాధన చేసి అన్ని పాత్రలు అందరూ చేయగల శక్తి వచ్చినప్పుడు మాత్రమే  దానిని రంగస్థలంపై ప్రదర్శిస్తాడు. నాటకం అంటే అంత ప్రాణం ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి రెండు మూడు నాటకాలు పంపించినా  మా నిర్వాహకుడు దేనిని  ఎన్నిక చేయలేదు ఒక పర్యాయం తన రచనను తీసుకొని వచ్చి నన్ను కలిసి దాని కథ మొత్తం చెప్పి  రేడియోలో అవకాశం ఉంటుందా అని అడిగాడు  నేను ఆ శాఖ చూస్తున్న హనుమంతరావు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈ నాటకాన్ని  నేను చేస్తాను  రేడియోకు కావాల్సిన చిన్న చిన్న మార్పులు చేసి  వారి బృందం తోనే రికార్డ్ చేస్తాను అని చెప్తే  ఎప్పుడూ ఆయన  నా మాటను కాదనలేదు ఇప్పుడు కూడా ఆ వ్యవహారమంతా నాకే అప్పజెప్పి నేను వస్తాను కానీ అంతా నీవే చూసుకోవాలి  అన్న నియమంతో వారి గ్రామం మా సాంకేతిక నిపుణులతో వెళ్లి రికార్డ్ చేశాం. రెడ్డి గారు తన నాటకంలో చేసిన ప్రయోగం ఏమిటంటే  మిడతల నుంచి  పైరును పాడుచేసే  అన్ని కీటకాలకి  మానవ వేషాలని వేసి  ఆ పేర్లతోనే  (మిడత లాంటివి) వేదికపై ప్రదర్శించాడు  వ్యవసాయ శాఖ  సంచాలకులు దానిని అన్ని గ్రామాలలో ప్రదర్శించి గ్రామస్తులకు ఎంతో ఉపయోగకరంగా చేద్దామన్న అభిప్రాయంతో  మమ్మల్ని కూడా సంప్రదించి  రెడ్డి గారిని ప్రోతహించారు. ఇది వాణి ఛాయాచిత్రం.


కామెంట్‌లు