చిత్రకవిత :- నమోన్నమః @వెలుగులోనే ఆనందం @ కోరాడ నరసింహారావు !
ఈ సంసారసాగరంలో.... 
        నావప్రయాణమే మనిషి బ్రతుకు!
అజ్ఞానపు చీకటి వీడనంత వర కూ... ఐనది కాదనుకుని,కానిది 
ఔననుకునేభ్రమలో..అవకతవకల తప్పటడుగులతో... పడి లేవటం... లేచి పడిపోవటమే!
  ఇది రజ్జు, సర్ప భ్రాoతి !
   సాఫీగా సాగవలసిన జీవన నౌకకు ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాంటిదే... !
   పామును తాడనుకున్నా... 
తాడును పామనుకున్నా ప్రమాదమే... !
తాడును పామనుకుని గుండె ఆగి ఒకరుచస్తే..., 
 పామునుతాడనుకుని చేతితో పట్టుకోగా... ఆ పాము కరచి, ఇంకొకడు చచ్చాడు !!
రెండూ ప్రమాద హేతువులే !
భౌతికచీకట్లను భానునివెలుగు
అజ్ఞాన తిమిరానికి జ్ఞాన తేజం 
అత్యావశ్యకాలు... !
అగమ్య జీవన ప్రయాణం లో 
వెలుగు ఓ దిక్సూచి, ఓ తెర చాప, సాఫీగా తీరం చేర్చే మంచి నేస్తం... !
  వెలుగే జ్ఞానము....... జ్ఞానమే     ఆనందము, సౌఖ్యము  !
  వెలుగు దైవమె..., అందుకే 
  దినకరుడు ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్నాడు !
జ్ఞాన, ఐశ్వర్య, ఆరోగ్య, ఆనంద ప్రదాతా నమోన్నమః 🙏💐🙏**

కామెంట్‌లు