గోడలు లేని ఇంటి తలుపులు
తెరవడం ఎంత కష్టం!!
మేఘాలకు ఆవల ఎగురుతున్న
పక్షికి
తడవడం ఎంత కష్టం!!?
పారుతున్న ఏరు ఎగరడం చూశారా
భూమ్యాకాశాల్లో
విరబూసిన జడల్లా
జలపాతం అది!!
కాగితంపై అక్షర సైన్యాన్ని
తయారు చేస్తున్న యోగి అతడు
నక్షత్రాల గుంపులో ఊరేగుతున్న
సీతాకోచిలుకకు జ్యోస్యం చెప్తున్నా
జ్యోతిష్యుడు అతడు!!
దిగమింగడానికీ అమృతం కాదు అది
విషం!!
ఖర్చు చేయడానికి ధనం కాదు అది
నిమిషం!!
సప్త సముద్రాలు సమస్త ఆకాశం
నీలిరంగు కాదు నిజంగా అది విసర్జించిన రంగే!!
రంగులు రత్నాలు కాదు
రంగులరాట్నం అది!!?
కన్నులు కావు అవి కన్నెపిల్లలు
ఎండమావులు కావు అవి
కార్తీక దీపాలు!!
పిల్ల గాలులు వీచినా సరే ఆరిపోని
మండుతున్న అఖండ దీపాలు అవి!!
కాళ్ల గజ్జల మోతలకు కురుస్తున్న
వడగళ్ల వర్షం
కళ్ళు మూసినా తెరిచిన ఆగని వర్షం
ఒక హృదయ చలనచిత్రం అది!!?
గొంతులో బంధించిన మాటల పుట్టుకల్ని
గుండెల్లో సమాధి చేస్తేనే సాంప్రదాయం!!
మొరిగిన కుక్కల వెంట
మొగలిపూల వాసన కాదు
నాగుపాములను పంపడానికి
నరుల వాసన అది విరుగుడు లేదు!!?
గతం ఒక పాత గీత
గంగా పారుతున్న ఒక వర్తమానం
సముద్రం పెద్ద ఉపద్రవం
నది నిజమైన నిధి!!
రక్త మాంసాల నదులు మనుషులు
శక్తిసామర్థ్యాల సూర్యచంద్రులు
వాళ్ల తలకాయలు!!?
మనసు మంచిదా కాదా
అని కాదు
బుద్ధి మంచిదా కాదా
అని కాదు
జ్ఞాపకం మాత్రమే మంచిది కాదు!!
అది అజ్ఞాతమైతేనే మంచిది!!?
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి