మనజాతి వైభవము "శంకర ప్రియ" శీల.,సంచారవాణి: ౯౯౧౨౭ ౬౭౦౯౮
 👌మన జాతి వైభవము
      చాటరా దశదిశల!
      ఎత్తరా జెండాను!
              ఓ తెలుగు బాల!
    ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌మన జాతీయ జెండా.. మువ్వన్నెల జెండా! ముచ్చటైన జెండా! ఆ మూడు వర్ణములలో,
"కాషాయ వర్ణము".. త్యాగమునకు, అమృతత్వమునకు.. చిహ్నము! "శ్వేత వర్ణము".. శాంతికి, స్వచ్ఛతకు చిహ్నము! "హరిత వర్ణము".. సౌభాగ్యమునకు, పాడిపంటలకు.. చిహ్నము! త్రివర్ణ పతాకం మధ్యలో నున్న "ధర్మ చక్రం"... ధార్మిక, నైతిక సూత్రములకు సంకేతము!
👌మన భారత దేశము.. అన్ని రంగములలో ప్రగతిని సాధించిoది! అగ్ర రాజ్యములతో ధీటుగా నిలిచింది! ప్రపంచములోని ప్రజలందరికీ.. చేతనైనంత  సహాయ సహకారములు నొసంగుచున్నది!
 👌మంత్రద్రష్టలైన, మనమహర్షులు.. సనాతన భారతీయ ధర్మమును.. విశ్వ వ్యాప్తము కావించారు! మన "ఆర్ష ధర్మము".. అందరికీ మార్గదర్శక మైనది!
 👌మన భారత జాతి ..పూర్వ వైభవమును, కీర్తి ప్రతిష్టలను.. దశ దిశలా వ్యాప్తి చేయాలి, మనమంతా! అట్లే,  త్యాగము, శాంతి, సౌభాగ్యములకు సంకేతమైన, మన జాతీయ జెండాను, "విజయ కేతనం"గా అన్నివైపులా ఎగుర వేయాలి! అందరికీ అమృత మహోత్సవం సందర్భముగా,.... "శుభ కామనలు" వర్ధిల్లు గాత!
 "జై హింద్! జై భారత్!"
   ⚜️సీస పద్యము⚜️
     ఎత్తరా! ధీర! చెయ్యెత్తరా! నిను గాంచి,
యెదురు లేదని, విశ్వమెల్ల యెరుగ,
       ఎత్తరా! బ్రొటన వేలెత్తరా! విజయమ్ము మనకు సొంతమ్మను మాట దెల్ప,
    ఎత్తరా! వీర ! గొంతెత్తి "జై హిందంచు"
నినదింప వైరులే నిల్చి చూడ,
   ఎత్తరా! నింగిలో నెత్తరా! జెండాను భరత భూమియె "సార్వభౌమ" మనగ,
      (తేటగీతి)
    పోరు సల్పగ క్రీడికి వారసుడవు!
    ధర్మగతి నెంచ నీవొక ధర్మజుడవు!
    కృపను జూపగ నీవె శ్రీకృష్ణ మూర్తి!
   మనది భారత జాతిరా! మరువ బోకు!!
       ( "స్వాతంత్ర్య దినోత్సవ శుభ కామనలు" రచన:  శ్రీ మైలవరపు మురళీ కృష్ణ.,)
🙏వందే మాతరం! వందే మాతరం!🙏

కామెంట్‌లు