ఆధ్యాత్మిక దిశానిర్దేశకుడు – డా. ఎం.వి. సౌందరరాజన్:- -ఎస్.వి.రమణా చార్య,సీనియర్ జర్నలిస్ట్

 హైదరాబాద్‌ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయానికి దేశవ్యాప్త ఖ్యాతిని తీసుకొచ్చిన ప్రధాన అర్చకులు డా. ఎం.వి. సౌందరరాజన్ గారు ఆధ్యాత్మిక పరిపాలనలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచారు. సంప్రదాయ వేద విద్యలో ప్రావీణ్యం సంపాదించిన ఆయన, ఆలయాన్ని కేవలం పూజా స్థలంగా కాకుండా సమానత్వానికి ప్రతీకగా తీర్చిదిద్దారు.
హుండీ రహిత విధానం, విఐపీ ప్రత్యేక దర్శనాలకు పూర్తిగా నో చెప్పిన తీరు, “దేవుడి ముందు అందరూ సమానమే” అన్న సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన ధైర్యం .. ఇవే ఆయన ప్రత్యేకతలు. ఈ విధానం కారణంగానే చిలుకూరు బాలాజీ ఆలయం భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువుగా మారింది.
సామాజిక అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడంలోనూ, ఆలయ స్వతంత్రతను కాపాడడంలోనూ ఆయన ఎప్పుడూ ముందుండేవారు. భక్తి, ధర్మం, సామాజిక బాధ్యతల సమన్వయంతో ఆయన నిర్వహించిన సేవలు ఆలయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయి.
దాదాపు తొంభై ఏళ్ల వయస్సులో పరమపదించిన డా. సౌందరరాజన్ గారు, భక్తుల హృదయాల్లో మాత్రం శాశ్వత స్థానం సంపాదించారు. ఆయన సేవలు చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఆధ్యాత్మిక ఉద్యమంగా మలిచాయి.

కామెంట్‌లు